NEET UG దరఖాస్తు ఫార్మ్ కరెక్షన్ 2024 (NEET UG 2024 form Correction window) : NEET UG 2024 ఫార్మ్ కరెక్షన్ విండో ఈరోజు అంటే మార్చి 20, 2024కి క్లోజ్ అవ్వనుంది. రిజిస్టర్డ్ మెడికల్ అభ్యర్థులందరూ ఫార్మ్ కరెక్షన్ విండో (NEET UG 2024 form Correction Window) క్లోజ్ అవ్వడానికి ముందు వారి NEET UG దరఖాస్తు ఫార్మ్‌లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి అవసరమైన దిద్దుబాట్లు చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో NEET UG పరీక్ష సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024ని విడుదల చేస్తుంది. ఇక్కడ మేము మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా ముందస్తు సిటీ స్లిప్‌ల అంచనా తేదీని ఇక్కడ అందించాం.
NEET UG (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్) 2024-25 అకడమిక్ సెషన్ కోసం భారతదేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో MBBS, BDS మరియు ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోసం NTA చే నిర్వహించబడుతోంది.
NEET UG సిటీ ఇంటిమేషన్ స్లిప్ తేదీ 2024 (అంచనా) (NEET UG Expected City Intimation Slip Date 2024)
NEET UG 2024 రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని సరి చేయడానికి ఆన్‌లైన్ విండో 11:50 PM తర్వాత క్లోజ్ చేయబడుతుంది. పరీక్ష తదుపరి ఈవెంట్‌ల అంచనా తేదీని ఈ దిగువ పట్టికలో ఇక్కడ చెక్ చేయండి.
NEET UG అప్లికేషన్ ఈవెంట్‌లు 2024 | తేదీలు |
---|---|
దరఖాస్తు ఫార్మ్ కరెక్షన్ చివరి తేదీ | మార్చి 20, 2024 (రాత్రి 11:50 వరకు) |
NEET UG అడ్వాన్స్ సిటీ స్లిప్ 2024 | ఏప్రిల్ 20, 2024 నాటికి |
NEET UG 2024 అడ్మిట్ కార్డ్ తేదీ | మే 1, 2024 |
పరీక్ష తేదీ | మే 5, 2024 (షెడ్యూల్డ్) |
NEET UG ఫారమ్ కరెక్షన్ డైరెక్ట్ లింక్ 2024 |
---|
NEET UG సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది ప్రతి అభ్యర్థికి కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని పేర్కొనే దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన అంశాలలో ఒకటి. దీని ద్వారా అభ్యర్థులకు నిర్ణీత సమయంలో అవసరమైతే చేయాల్సిన ప్రయాణ ఏర్పాట్లపై అవగాహన కల్పిస్తారు. అయితే పరీక్ష కేంద్రం కచ్చితమైన చిరునామా NEET అడ్మిట్ కార్డ్ 2024 ద్వారా భాగస్వామ్యం చేయబడుతుంది.
NEET UG ఫారమ్ దిద్దుబాటు విండో ఈరోజు క్లోజ్ అవుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏవైనా లోపాలను సమీక్షించడానికి, అప్‌డేట్ చేయడానికి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంచనా తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి మరియు రాబోయే NEET UG 2024 పరీక్ష కోసం శ్రద్ధగా సిద్ధం చేయండి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం
https://www.collegedekho.com/te/news/
ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.