NICL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 (NICL Assistant Recruitment 2024) : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, NICL అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు NICL అధికారిక వెబ్‌సైట్ నేషనల్‌ఇన్సూరెన్స్ nic.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ (NICL Assistant Recruitment 2024) డ్రైవ్ సంస్థలో 500 పోస్టులను భర్తీ చేస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 24న ప్రారంభమై నవంబర్ 11, 2024న ముగియనుంది. ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి ఈ దిగువున అందించాం.
NICL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 ముఖ్యమైన తేదీలు (NICL Assistant Recruitment 2024 Important Dates)
NICL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, వివరాలను ఇక్కడ చూడండి.ఈవెంట్ | ముఖ్యమైన తేదీలు |
---|---|
NICL అసిస్టెట్ రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 24, 2024 |
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | నవంబర్ 11, 2024 |
ఫేజ్ I పరీక్ష | నవంబర్ 30, 2024 |
ఫేజ్ 2 పరీక్ష | డిసెంబర్ 28, 2024 |
NICL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 అర్హత ప్రమాణాలు (NICL Assistant Recruitment 2024 Eligibility Criteria)
NICL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హత ప్రమాణాలు ఉండాలి.- ఒక అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కనీస విద్యార్హత లేదా కేంద్ర ప్రభుత్వంతో గుర్తించబడిన ఏదైనా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. అభ్యర్థి 01.10.2024 నాటికి అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
- దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.10.1994 కంటే ముందు 01.10.2003 (రెండు రోజులు కలుపుకొని) కంటే ముందు జన్మించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
NICL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ (NICL Assistant Recruitment 2024 Selection Process)
- అభ్యర్థులందరూ ఆన్‌లైన్ ప్రిలిమినరీ & మెయిన్ పరీక్షకు హాజరవ్వాలి. ఆ తర్వాత మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు ప్రాంతీయ భాషా పరీక్షకు మరింత షార్ట్‌లిస్ట్ చేయబడతారు. ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్షలను కలిగి ఉంటుంది. ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది.
- ఫైనల్ మెరిట్ జాబితా, రాష్ట్రాల వారీగా, కేటగిరీల వారీగా, ప్రాంతీయ లాంగ్వేజ్ పరీక్షకు అర్హత సాధించడానికి లోబడి ఆన్‌లైన్ మెయిన్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల అవరోహణ క్రమంలో తయారు చేయబడుతుంది.