ఎన్‌పీసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ 2023 (NPCIL Executive Trainee Jobs 2023): ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ (NPCIL Executive Trainee Jobs 2023) జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 325 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గేట్ 2021 (GATE 2021), గేట్ 2022 (GATE 2022) , గేట్ 2023 (GATE 2023) స్కోర్స్ ఆధారంగా ఈ పోస్టులకు (NPCIL Executive Trainee Jobs 2023) అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ npcilcareers.co.inలో మాత్రమే అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి నెలకు రూ.56,100ల జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎన్పీసీఐఎల్‌లో ఖాళీల వివరాలు (NPCIL Vacancy Details)
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాల వివరాలు ఈ దిగువున టేబుల్లో వివరంగా ఇవ్వడం జరిగింది.సబ్జెక్ట్ పేరు | పోస్టులు |
---|---|
మెకానికల్ | 123 |
కెమికల్ | 50 |
ఎలక్ట్రికల్ | 57 |
ఎలక్ట్రానిక్స్ | 25 |
Instrumentation | 25 |
సివిల్ | 45 |
NPCIL రిక్రూట్‌మెంట్‌కు అర్హత ప్రమాణాలు (NPCIL Recruitment required eligibility details)
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఈ దిగువున తెలియజేసిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.- NPCIL అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాల నుంచి B.Sc, B.E లేదా B.Tech పూర్తి చేసి ఉండాలి.
- అభ్యర్థి గరిష్ట వయస్సు 28, ఏప్రిల్ 2023 నాటికి 26 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ జనరల్ అభ్యర్థులకు పదేళ్లు, పీడబ్ల్యూడీ ఓబీసీ అభ్యర్థులకు 13 ఏళ్లు, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 15 ఏళ్లు వయస్సులో మినహాయింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500లు ఫీజుగా చెల్లించాలి
- మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు.
- ఫీజును ఆన్‌లైన్ పద్ధతిలోనే చెల్లించాల్సి ఉంటుంది.
NPCIL ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు 2023 కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్టెప్స్ (Steps to Apply for NPCIL Executive Trainee Jobs 2023)
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఏప్రిల్ 11వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన లింక్ అదే రోజు నుంచి యాక్టివేట్ అవుతుంది. అభ్యర్థులు ఏప్రిల్ 28, 2023 తేదీకల్లా దరఖాస్తు చేసుకోవాలి.- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ npcilcareers.co.in ని సందర్శించాలి
- హోం పేజీలో దరఖాస్తు చేసుకోబోయే NPCIL రిక్రూట్‌మెంట్ లేదా కెరీర్‌ల కోసం చెక్ చేయాలి.
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను ఓపెన్ చేసి అర్హతలను చెక్ చేసుకోవాలి
- తర్వాత అభ్యర్థులు ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తు ఫార్మ్‌ని పూరించాలి.
- దరఖాస్తు ఫీజును చెల్లించి ఏప్రిల్ 28, 2023లోపు దరఖాస్తు ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి.