నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, రైల్వే శాఖలో 7934 పోస్టులు (RRB JE Recruitment 2024)

Andaluri Veni

Updated On: July 22, 2024 06:31 pm IST

రైల్వే రిక్రూట్‌మెంట్ (RRB JE Recruitment 2024) భారతీయ రైల్వేలో 7934 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందించాం. 
 
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్,  రైల్వే శాఖలో  7934 పోస్టులు (RRB JE Recruitment 2024)నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, రైల్వే శాఖలో 7934 పోస్టులు (RRB JE Recruitment 2024)

RRB JE రిక్రూట్‌మెంట్ 2024 (RRB JE Recruitment 2024) : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) భారతీయ రైల్వేలో 7934 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ (RRB JE Recruitment 2024) రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అభ్యర్థులు జూలై 30, 2024 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 29 ఆగష్టు 2024. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.  అప్లై చేసుకోవడానికి ముందు, అర్హత ప్రమాణాలు, వయో పరిమితి, దరఖాస్తు ఫీజు, అన్ని ముఖ్యమైన తేదీలను ఇక్కడ అందించాం.

ఈ న్యూస్‌లో RRB JE ఖాళీల గురించి అవసరమైన అన్ని వివరాల గురించి మీకు తెలియజేయబడుతుంది. ఇక్కడ మీకు అధికారిక నోటిఫికేషన్ లింక్, ఇతర లింక్ అందించబడతాయి. మీరు అధికారిక వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు లేదా డైరక్ట్ లింక్ కింద ఇవ్వబడింది.

RRB JE రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDF (RRB JE Recruitment 2024 Notification PDF)

RRB JE రిక్రూట్‌మెంట్ 2024 PDF నోటిఫికేషన్ - ఇక్కడ క్లిక్ చేయండి

RRB JE రిక్రూట్‌మెంట్ 2024 ముఖ్యమైన తేదీలు (RRB JE Recruitment 2024 Dates)

మీరు దరఖాస్తుకు ప్రారంభ తేదీ, చివరి తేదీ, పరీక్ష తేదీ, అడ్మిట్ కార్డుకు సంబంధించిన అన్ని తేదీలు ఇక్కడ అందించాం.  అన్ని ముఖ్యమైన తేదీలను చెక్ చేయవచ్చు.
ఈవెంట్ ముఖ్యమైన తేదీలు
RRB JE రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫార్మ్ ప్రారంభ తేదీ 30 జూలై 2024
RRB JE రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫార్మ్ చివరి తేదీ 29 ఆగస్టు 2024
RRB JE రిక్రూట్‌మెంట్ పరీక్ష తేదీ త్వరలో తెలియజేయబడుతుంది
RRB JE రిక్రూట్‌మెంట్  అడ్మిట్ కార్డ్ త్వరలో తెలియజేయబడుతుంది

RRB JE రిక్రూట్‌మెంట్ 2024 అర్హత ప్రమాణాలు (RRB JE Recruitment 2024 Age Limit)

ఈ పోస్టులకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలను ఈ దిగువున అందించాం.
  • రైల్వేలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో బీఈ, బీటెక్ డిగ్రీ, లేదా డిప్లామొ చేసి ఉండాలి.
  • కెమికల్ సూపర్‌వైజర్ పోస్టులకు, లేదా రీసెర్చ్, మెటలార్జికల్ సూపర్ వైజర్ రీసెర్చ్ పోస్టులకు సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.
  • ఈ ఉద్యోగాల భర్తీకి  అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు ఉండాలి. వివిధ కేటగిరీల రీత్యా అభ్యర్థుల వయస్సులో మినహాయింపు ఉంటుంది.
  • ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500లు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాపడ్ అభ్యర్థులు రూ.250లు, మహిళా అభ్యర్థులు రూ.250లు చెల్లించాల్సి ఉంటుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/rrb-je-recruitment-2024-notification-pdf-55319/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!