SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024-25 (SBI Clerk Recruitment Notification 2024-25) : బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకోసం శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ (SBI Clerk Recruitment Notification 2024-25) రిలీజ్ చేసింది. SBI జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేసింది.ఈ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అంటే డిసెంబర్ 17 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు తమ దరఖాస్తును జనవరి 7, 2025లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ https://bank.sbi/web/careers/current-openings లేదా https://www.sbi.co.in/web/careers/current-openingsకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ PDF (SBI Clerk Notification 2025 PDF)
SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ PDF - ఇక్కడ క్లిక్ చేయండి |
---|
20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ చేసినవారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు అభ్యర్థుల సెలక్షన్ ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి నెలకు రూ.46 వేలకుపైగా జీతం ఉంటుంది.
SBI క్లర్క్ ఎడ్యుకేషనల్ అర్హత ప్రమాణాలు 2025 (SBI Clerk Educational Qualification 2025)
SBI క్లర్క్ పరీక్షకు అర్హత ప్రమాణాలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పొందాలి.
- ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికెట్లను కలిగి ఉన్న అభ్యర్థులు IDD ఉత్తీర్ణత తేదీని 31 డిసెంబర్ 2024న లేదా అంతకు ముందు ఉండేలా చూసుకోవాలి.
- గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తాత్కాలికంగా ఎంపిక చేయబడితే, వారు డిసెంబర్ 31 లేదా అంతకు ముందు గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు ప్రూఫ్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
- అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు - 01.04.2024 నాటికి 28 సంవత్సరాలు ఉండాలి.
SBI క్లర్క్ 2024 ముఖ్యమైన తేదీలు (SBI Clerk 2024 Important Dates)
SBI క్లర్క్ పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల తేదీలు అధికారిక SBI క్లర్క్ నోటిఫికేషన్ 2024తో డిసెంబర్ 16, 2024న విడుదలయ్యాయి.నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున పట్టికలో అందించాం.ఈవెంట్స్ | తేదీలు |
---|---|
SBI క్లర్క్ నోటిఫికేషన్ 2024 | 16 డిసెంబర్ 2024 |
SBI క్లర్క్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రారంభ తేదీ | 17 డిసెంబర్ 2024 |
SBI క్లర్క్ ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ | 7 జనవరి 2025 |
SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ 2024 | ఫిబ్రవరి 2025 |
SBI క్లర్క్ మెయిన్స్ పరీక్ష తేదీ 2024 | మార్చి-ఏప్రిల్ 2025 |
SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకునే విధానం (Steps to Apply for SBI Clerk Recruitment 2024)
SBI క్లర్క్ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో? ఈ దిగువున అందించాం. అభ్యర్థులు ఈ స్టెప్స్‌ని ఫాలో అయి దరఖాస్తు చేసుకోవచ్చు.- ముందుగా అభ్యర్థులు అధికారిక SBI కెరీర్‌ల పేజీని సందర్శించండి.
- చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్‌ని ఉపయోగించి నమోదు చేసుకోండి.
- కచ్చితమైన వివరాలతో దరఖాస్తును పూరించాలి. .
- స్పెసిఫికేషన్‌ల ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటోలు అప్‌లోడ్ చేయాలి.
- అనంతరం దరఖాస్తు ఫీజు చెల్లించాలి.