SSC CGL నోటిఫికేషన్ 2023 విడుదల (SSC CGL 2023 notification pdf):
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inలో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ CGL ఎగ్జామినేషన్ 2023 SSC CGL నోటిఫికేషన్ 2023ని (SSC CGL 2023 notification pdf) విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు SSC CGL నోటిఫికేషన్ 2023 PDFలో దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
SSC CGL నోటిఫికేషన్ 2023 విడుదల: ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు, ఇతర వివరాలు (SSC CGL Notification 2023 Released: Dates, Eligibility Criteria and Other Details)
పరీక్ష రాసేవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా SSC CGL నోటిఫికేషన్ 2023 PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలకు సంబంధించి డీటెయిల్స్ , అర్హత ప్రమాణాలు, ముఖ్యమైన తేదీలు ఈ కింద ఇవ్వడం జరిగింది.
కండక్టింగ్ అథారిటీ | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) |
---|---|
పోస్ట్ పేరు | కేంద్ర ప్రభుత్వం కింద గ్రూప్ B, C అధికారులు |
అందుబాటులో ఉన్న మొత్తం ఖాళీలు | 7,500 (సుమారు) |
పరీక్ష స్థాయి | జాతీయ స్థాయి |
పరీక్ష మోడ్ | ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) |
అప్లికేషన్ మోడ్ | ఆన్‌లైన్ |
ఉద్యోగ స్థానం | భారతదేశం అంతటా |
వర్గం | ప్రభుత్వ ఉద్యోగాలు |
SSC CGL 2023 అర్హత ప్రమాణాలు | అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. |
SSC CGL 2023 ఎంపిక ప్రక్రియ |
|
పరీక్ష వ్యవధి | టైర్ 1: 60 నిమిషాలు టైర్ 2:
|
అధికారిక వెబ్‌సైట్ | ssc.nic.in |
SSC CGL నోటిఫికేషన్ 2023: ముఖ్యమైన తేదీలు (SSC CGL Notification 2023: Important Dates)
ఈ దిగువ అందించిన టేబుల్లో ముఖ్యమైన SSC CGL తేదీలని చెక్ చేయాలి.
SSC CGL నోటిఫికేషన్ 2023 | విడుదలైంది. |
---|---|
SSC CGL అప్లికేషన్ ఫార్మ్ 2023 ప్రారంభం తేదీ | ఏప్రిల్ 3, 2023 (కొనసాగుతోంది) |
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ | మే 3, 2023 |
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ రసీదు కోసం చివరి తేదీ | మే 3, 2023 (11 PM) |
ఆఫ్‌లైన్ చలాన్ జనరేషన్ కోసం చివరి తేదీ | మే 4, 2023 (11 PM) |
చలాన్ ద్వారా చెల్లింపు కోసం చివరి తేదీ | మే 4, 2023 (11 PM) |
చలాన్ ద్వారా చెల్లింపు కోసం చివరి తేదీ (బ్యాంక్ పని వేళల్లో) | మే 5, 2023 (11 PM) |
అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు విండో | మే 7 నుంచి మే 8, 2023 (11 PM) |
SSC CGL పరీక్ష తేదీ 2023 (టైర్-I) | జూలై 2023 |
SSC CGL నోటిఫికేషన్ 2023: దరఖాస్తు ప్రక్రియ (SSC CGL Notification 2023: Application Process)
SSC CGL 2023 కోసం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 3, 2023 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు గడువు తేదీకి ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి . జూలై 2023లో SSC CGL అధికారిక నోటిఫికేషన్ 2023 ప్రకారం టైర్ 1 పరీక్ష CBT మోడ్‌లో జరగాల్సి ఉంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.