SSC CGL రెస్పాన్స్ షీట్ ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ 2024 (SSC CGL Response Sheet Expected Release Date 2024) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీతో పాటు SSC CGL రెస్పాన్స్ షీట్ 2024ని (SSC CGL Response Sheet Expected Release Date 2024) పబ్లిష్ చేయాలని భావిస్తున్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in లో వారి రిజిస్టర్డ్ ఖాతాకు లాగిన్ చేయడం ద్వారా వారి SSC CGL రెస్పాన్స్ షీట్ & ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ప్రకారం, SSC CGL రెస్పాన్స్ షీట్ 2024 అక్టోబర్ 2024 మొదటి వారంలో కమిషన్ ద్వారా ప్రచురించబడుతుందని భావిస్తున్నారు.
SSC CGL రెస్పాన్స్ షీట్ అంచనా విడుదల తేదీ 2024 (SSC CGL Response Sheet Expected Release Date 2024)
రెస్పాన్స్ షీట్‌ని యాక్సెస్ చేయడానికి, అభ్యర్థులు వారి అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. రెస్పాన్స్ షీట్ అభ్యర్థులు తమ సమాధానాలను సమీక్షించుకోవడానికి, వారి సంభావ్య స్కోర్‌లను లెక్కించడానికి అనుమతిస్తుంది. SSC CGL రెస్పాన్స్ షీట్ విడుదల తేదీ 2024 దిగువన అందించడం జరిగింది.
SSC CGL 2024 ఈవెంట్ | తాత్కాలిక ఈవెంట్ తేదీ |
---|---|
SSC CGL రెస్పాన్స్ షీట్ అంచనా విడుదల తేదీ 2024 - 1 | అక్టోబర్ 2024 మొదటి వారం - (అంచనా) |
SSC CGL రెస్పాన్స్ షీట్ అంచనా విడుదల తేదీ 2024 - 2 | అక్టోబర్ 2024 రెండో వారం - ఆలస్యమైతే |
అంచనా గ్యాప్ పీరియడ్ | పరీక్ష చివరి తేదీ తర్వాత 10 నుండి 15 రోజులు |
SSC CGL టైర్ 1 ఆన్సర్ కీ పబ్లికేషన్ | SSC CGL ఆన్సర్ కీ అంచనా విడుదల తేదీ 2024 |
SSC CGL టైర్ 1 ఫలితం ప్రకటన | SSC CGL ఫలితం అంచనా విడుదల తేదీ 2024 |
కమిషన్ ఆన్సర్ కీ పరీక్షలో అభ్యర్థులు చేసిన ప్రతిస్పందనలతో కలిపి PDF రూపంలో రెస్పాన్స్ షీట్‌ని విడుదల చేస్తుంది. రెస్పాన్స్ షీట్, ఆన్సర్ కీ రెండింటినీ ఉపయోగించి, అభ్యర్థులు సరైన సమాధానాలను సులభంగా కనుగొనవచ్చు. దానికనుగుణంగా వారి స్కోర్‌లను లెక్కించవచ్చు. SSC CGL ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ రెండూ PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు PDFని డౌన్‌లోడ్ చేసి, అది విడుదలైన తర్వాత భవిష్యత్తు సూచన కోసం సేవ్ చేయాలి.
SSC CGL రెస్పాన్స్ షీట్ 2024: స్కోర్‌లను ఎలా లెక్కించాలి?
లెక్కింపు సమయంలో, అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్సర్ కీ, వారి గుర్తించబడిన రెస్పాన్స్‌ను తమ దగ్గర ఉంచుకోవాలి. వారు ప్రతి సరైన ఆన్సర్ కి రెండు మార్కులు జోడించాలి. తప్పువాటికి 0.5 మార్కులు తీసివేయాలి. అభ్యర్థి అంచనా కటాఫ్ స్కోర్ కంటే ఎక్కువ స్కోర్ చేస్తే, వారు SSC CGL టైర్ 2 పరీక్షకు అర్హత పొందుతారు.