SSC GD 2024 ఫైనల్ రిజల్ట్స్ : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC GD 2024 పరీక్ష ఫిబ్రవరి 20 నుండి మార్చి 07,2024 వరకూ నిర్వహించబడింది. SSC GD 2024 వ్రాత పరీక్ష ఫలితాలు జూలై 11, 2024 తేదీన విడుదల అయ్యాయి. వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాత రౌండ్స్లో పాల్గొన్నారు, ఈ రౌండ్స్ లో పాల్గొన్న వారికి ఫైనల్ రిజల్ట్ విడుదల కావాల్సి ఉంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి అందిన తాజా సమాచారం ప్రకారం SSC GD (జనరల్ డ్యూటీ) కానిస్టేబుల్ ఫైనల్ రిజల్ట్స్ ఏ క్షణానైనా విడుదలయ్యే అవకాశం ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC GD 2024 ఫైనల్ రిజల్ట్స్ కి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.
SSC GD ఫైనల్ రిజల్ట్స్ 2024 తేదీలు (SSC GD Final Results 2024 Release Date)
SSC GD ఫైనల్ రిజల్ట్స్ 2024 ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉంది , ఫలితాలకు సంబంధించిన తేదీలను ఈ క్రింది టేబుల్ లో వివరంగా తెలుసుకొచ్చు .
వివరాలు | తేదీలు |
---|---|
SSC GD పరీక్ష తేదీ | ఫిబ్రవరి 20 నుండి మార్చి 07, 2024 |
SSC GD వ్రాత పరీక్ష ఫలితాలు | జూలై 11, 2024 |
SSC GD ఫైనల్ రిజల్ట్స్ | అతి త్వరలో |
SSC GD ఫైనల్ రిజల్ట్స్ 2024 చెక్ చేసే విధానం ( How To Check SSC GD Final Results 2024)
SSC GD ఫైనల్ రిజల్స్ చెక్ చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.- స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైటు ssc.gov.in ఓపెన్ చేయండి
- GD కానిస్టేబుల్ అని ఉన్న పాప్ అప్ లేదా లింక్ మీద క్లిక్ చేయండి
- మీ హాల్ టికెట్ నెంబర్ , డేట్ ఆఫ్ బర్త్ మొదలైన వివరాలు ఎంటర్ చేయండి .
- మీ ఫలితం స్క్రీన్ మీద కనిపిస్తుంది, PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేయండి .