SSC స్టెనోగ్రాఫర్ ఫలితాల తేదీ 2024 (SSC Stenographer Result Date 2024) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'C', 'D' ఎగ్జామినేషన్ 2024 (పేపర్ I) ప్రొవిజనల్ ఆన్సర్ కీ కోసం అభ్యంతర విండోను డిసెంబర్ 18న క్లోజ్ చేసింది. ఆన్సర్ కీలో ఉండే సమాధానాలతో సంతృప్తి చెందని అభ్యర్థులు తెలియజేసిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని.. అధికారిక ఆన్సర్ కీ విడుదల చేయనుంది. SSC స్టెనో 2024 గ్రేడ్ C, D పేపర్ I పరీక్షలు డిసెంబర్ 10, 11, 2024న జరిగాయి. ప్రశ్నపత్రంలో ఇంగ్లీష్, హిందీ రెండింటిలోనూ ఆబ్జెక్టివ్-టైప్ మల్టిపుల్ ఆప్షన్ క్వశ్చన్స్ (MCQలు) ఉన్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈ రిక్రూటింగ్ క్యాంపెయిన్ ద్వారా 2000 కంటే ఎక్కువ స్థానాలను భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో SSC స్టెనో గ్రాఫర్ రిక్రూట్‌మెంట్ పరీక్షా ఫలితాలను (SSC Stenographer Result Date 2024) త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.
SSC స్టెనోగ్రాఫర్ ఫలితాల 2024 వివరాలు (SSC Stenographer Result 2024 Details)
SSC స్టెనో 2024 గ్రేడ్ C, D పేపర్ I పరీక్షలు డిసెంబర్ 10, 11, 2024న నిర్వహించబడ్డాయి. ప్రశ్నపత్రంలో ఇంగ్లీష్, హిందీ రెండింటిలోనూ ఆబ్జెక్టివ్-టైప్ మల్టిపుల్-ఛాయిస్ ప్రశ్నలు (MCQలు) ఉన్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గించడం జరుగుతుంది.
సంస్థ | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) |
---|---|
పోస్ట్ పేరు | స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'సి' & 'డి' |
పరీక్ష పేరు | SSC స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'C' & 'D' పరీక్ష 2024 (పేపర్-I) |
పరీక్ష తేదీ | 10 మరియు 11 డిసెంబర్ 2024 |
కేటగిరి | ఫలితం |
SSC MTS 2024 ఫలితాల తేదీ | జనవరి మొదటి వారం 2025 (అంచనా) |
అధికారిక వెబ్‌సైట్ | https://ssc.gov.in |
SSC స్టెనోగ్రాఫర్ ఫలితాలు 2024 విడుదల తేదీ (SSC Stenographer Result 2024 Date)
SSC స్టెనోగ్రాఫర్ ఫలితాలు 2024 త్వరలో అంటే జనవరి మొదటివారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. SSC స్టెనోగ్రాఫర్ ఫలితం 2024 కోసం డౌన్‌లోడ్ లింక్ త్వరలో అందుబాటులోకి వస్తుంది, అభ్యర్థులు తమ పరీక్ష ఫలితాలను నేరుగా యాక్సెస్ చేయడానికి వీలు ఉంటుంది. అభ్యర్థులు తమ ఫలితాన్ని చెక్ చేయడానికి ssc.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ రాత పరీక్ష, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. SSC స్టెనోగ్రాఫర్ కటాఫ్ మార్కులు, మెరిట్ జాబితా 2024 కూడా పబ్లిష్ చేయబడుతుంది. ఇందులో పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల పేర్లు ఉంటాయి.అభ్యర్థుల కోసం ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఇక్కడ అందిస్తాం.