ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు 2024 (Summer Holidays for Inter Colleges) :
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీలకు మార్చి 30, 2024 చివరి పని రోజని ప్రకటించింది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు మార్చి 31, మే 31 మధ్య వేసవి సెలవులు (Summer Holidays for Inter Colleges) ఉంటాయని పేర్కొంది. ప్రధానోపాధ్యాయులు, నిర్వహణ బృందాలు ఈ షెడ్యూల్‌ను అనుసరించాలని సూచించింది.
ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు వేసవి సెలవులు మార్చి 31 నుంచి మే 31 వరకు ఉంటాయి. తెలంగాణలోని అన్ని జూనియర్, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలలకు వర్తిస్తాయని పేర్కొంది. జూన్ 1న కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చివరి ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,78,527 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4 లక్షల మంది ఉన్నారు. ఈసారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ 2024 ఫలితాలు ఎప్పుడు? (Telangana Intermediate Exam Results 2024)
ఇంటర్ పరీక్షా పేపర్ల మూల్యాంకన ప్రక్రియ పురోగతిలో ఉందని, ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు బోర్డు ఇప్పటికే తెలియజేసింది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు పరీక్షలు పూర్తైన 30 రోజుల తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇక ఈసారి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పరీక్షల నిర్వహణ, ఫలితాలను ప్రకటించాలని విద్యాశాఖ యోచిస్తుంది. ఈ క్రమంలో...ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తి చేసి... ఫలితాలను కూడా త్వరగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ చివరి వారంలో వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది చూస్తే మే 9వ తేదీన ఫలితాలను (TS Inter Results 2024) వెల్లడించింది. ఆ షెడ్యూల్ ను చూస్తే పరీక్షలు పూర్తైన 30 రోజుల గడువు తర్వాత ఫలితాలు వచ్చాయి.తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.