ఏపీ EDCET 2023 అప్లికేషన్ ఫార్మ్ ( AP EDCET 2023 Application Form) : ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( AP EDCET) పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) నిర్వహిస్తుంది. ఏపీ రాష్ట్రంలో ఉన్న కళాశాలలో B.Ed సీట్ల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఏపీ EDCET 2023 పరీక్షకు ఫిబ్రవరి నెలలో అప్లికేషన్ ఫార్మ్( AP EDCET 2023 Application Form) విడుదల అవుతుంది . B.Ed కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న విద్యార్థులు sche.ap.gov.in/EDCET వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఏపీ EDCET 2023 పరీక్ష మే 20, 2023 తేదీన జరగనుంది . B.A / B.Sc / B.COM / B.C.A / B.B.M స్ట్రీమ్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఏపీ EDCET పరీక్ష కు అప్లై చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి - ఏపీ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ తేదీలు
ఏపీ EDCET 2023 ముఖ్యమైన తేదీలు ( AP EDCET 2023 Important Dates)
ఏపీ EDCET 2023 పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టిక లో వివరంగా తెలుసుకోవచ్చు.
కార్యక్రమం |
తేదీ
|
---|---|
AP EDCET అప్లికేషన్ ఫార్మ్ ( AP EDCET 2023 Application Form)
| ఫిబ్రవరి 2023 |
AP EDCET ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
| ఫిబ్రవరి 2023 |
AP EDCET రిజిస్ట్రేషన్ చివరి తేదీ
| మార్చి 2023 |
AP EDCET హాల్ టికెట్ విడుదల
| ఏప్రిల్ 2023 |
AP EDCET పరీక్ష తేదీలు | మే 20, 2023 |
AP EDCET ఫలితాలు విడుదల
| జూన్ 2023 |
AP EDCET కౌన్సెలింగ్
| జూలై 2023 |
ఇవి కూడా చదవండి - ఏపీ ECET 2023 పరీక్షల షెడ్యూల్
ఏపీ EDCET 2023 రిజిస్ట్రేషన్ ఫీజు ( AP EDCET 2023 Registration Fee)
ఏపీ EDCET 2023 కు అప్లై( AP EDCET 2023 Application Form) చేసుకుంటున్న విద్యార్థులు చెల్లించవలసిన ఫీజు కేటగిరీ ప్రకారంగా క్రింది పట్టిక లో వివరించబడింది.
కేటగిరీ |
రిజిస్ట్రేషన్ ఫీజు
|
---|---|
జనరల్ విద్యార్థులు
| 600/- |
BC
| 450/- |
SC / ST
| 300/- |
ఇవి కూడా చదవండి - ఏపీ ఎంసెట్ 2023 పరీక్ష తేదీలు
ఏపీ EDCET పరీక్ష కు హాజరు అయ్యే అభ్యర్థుల కోసం ప్రతీ జిల్లాలోనూ కనీసం ఒకటి చొప్పున ఎగ్జామ్ సెంటర్ ను కేటాయిస్తారు. అభ్యర్థులు అప్లికేషన్ పూర్తి చేసే సమయంలో పరీక్ష కేంద్రం కోసం వారికి కావాల్సిన జిల్లా ను ఎంపిక చేసుకోవచ్చు.
ఏపీ EDCET 2023 గురించిన మరింత ముఖ్యమైన సమాచారం కోసం, ఎడ్యుకేషనల్ న్యూస్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.