Telangana HC NEET PG Hearing 2023: నీట్ పీజీ 2023 వాయిదాపై తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే?

Andaluri Veni

Updated On: February 15, 2023 05:44 pm IST

నీట్ పీజీ 2023 వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌‌పై తెలంగాణ హైకోర్టులో రెండో రోజు విచారణ (Telangana HC NEET PG Hearing 2023) జరిగింది. కేసు, కోర్టు విచారణలకు సంబంధించిన వివరాలు ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది. 
Telangana High Court Hearing on NEET PG 2023 PostponementTelangana High Court Hearing on NEET PG 2023 Postponement

తెలంగాణ హైకోర్టులో నీట్ పీజీ 2023 విచారణ (Telangana HC NEET PG Hearing 2023): NEET PG 2023 వాయిదాపై తెలంగాణ హైకోర్టు బుధవారం కూడా విచారణ చేపట్టింది. పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్న విద్యార్థులు దాదాపుగా విజయం సాధించారు. కోర్టు సెషన్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కాగా ఈ పిటిషన్ మధ్యాహ్నం 2:45 గంటలకు విచారణకు వచ్చింది. తెలంగాణ హైకోర్టు పరీక్షను వాయిదా వేయడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కానీ పరీక్ష తేదీని పునఃపరిశీలించాలని NMCని కోరింది. ఫిబ్రవరి 14న, తెలంగాణ హైకోర్టు NEET PG 2023పై మొదటి విచారణను చేపట్టింది, అయితే NMC తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణ ఫిబ్రవరి 15కి వాయిదా పడింది.

NEET PG 2023 వాయిదాపై ఫిబ్రవరి 15 తెలంగాణ హైకోర్టు విచారణలో ఏమి జరిగింది?

NEET PG 2023 వాయిదాపై తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణకు సంబంధించిన ప్రధాన అంశాలు ఈ  దిగువున అందించడం జరిగింది.
  • నీట్ పీజీ 2023 ఆశావాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది
  • పరీక్షను వాయిదా వేయడానికి NMC నిరాకరించింది, అదే విషయాన్ని కోర్టుకు తెలియజేసింది
  • ఈ సమస్యను కోర్టు విశ్లేషించింది. NMC చర్యలు కొంత చట్టవిరుద్ధమని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని కూడా కోర్టు పేర్కొంది
  • పరీక్ష వాయిదాను పరిగణనలోకి తీసుకుని రెండు వారాల్లో నిర్ణయం తెలియజేయాలని NMCని కోర్టు కోరింది
  • NMC కోర్టు స్టేట్‌మెంట్‌కు అంగీకరించింది. అది NEET PG 2023 పరీక్ష తేదీని పునఃపరిశీలించవచ్చు
  • NMC NEET PG 2023 కోసం కొత్త పరీక్ష తేదీతో వస్తుందని భావిస్తున్నారు
  • కొత్త పరీక్ష తేదీని నిర్ణయించాలా? వద్దా? అనేది NMC , ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేతుల్లో ఉంది
  • తెలంగాణ హైకోర్టు ఈ రోజు రాత్రి 8 గంటలకు అధికారిక ఉత్తర్వులను అప్‌లోడ్ చేసే అవకాశం ఉంది.
  • మొత్తం మీద, NEET PG 2023 వాయిదా పడబోతున్నట్టు తెలుస్తుంది. అయితే అది NMC నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది
  • విద్యార్థులు తమ పరీక్షల సన్నద్ధతను కొనసాగించాలని సూచించడం జరిగింది.

తెలంగాణ హైకోర్టు నీట్ పీజీ 2023 వాయిదా కేసు డీటెయిల్స్ (Telangana HC NEET PG 2023 Postponement Case Details)

NEET PG 2023 వాయిదా పిటిషన్‌కు సంబంధించిన ముఖ్యమైన కేసు వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది.
కేసు సంఖ్య WP/4213/2023
పిటిషన్ టైప్ రిట్ పిటిషన్
తేదీ మొదటి విచారణ ఫిబ్రవరి 14, 2023
ఐఏ అభ్యర్థులు (పిటిషనర్ ప్రార్థన) నీట్ పీజీ 2023ని మూడు నెలలు వాయిదా వేయాలని అభ్యర్థన
ఫస్ట్ హియరింగ్ ఫిబ్రవరి 14
మొదటి రోజు విచారణ కోర్టులో ఏం జరిగిందంటే తర్వాత రోజుకు వాయిదా వేసింది
రెండో విచారణ ఫిబ్రవరి 15
గౌరవనీయమైన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి
జస్టిస్ పుల్లా కార్తీక్
హియరింగ్ టైమ్ 2:43 PM
కోర్టు  హాల్ నెంబర్ 3
సీరియల్ నెంబర్ 26
రెండో రోజు విచారణలో కోర్టు ఏం చెప్పిందంటే..?

పరీక్ష తేదీని సవరించడం గురించి ఆలోచించాలని కోర్టు NMCని కోరింది

కేసు డీటెయిల్స్ PDF Click Here
15వ తేదీ కేసు డీటెయిల్స్ PDF Click Here

ఇంటర్న్‌షిప్ గడువును ఆగస్టు 11, 2023 వరకు పొడిగించిన తర్వాత NEET PG 2023ని వాయిదా వేయాలనే డిమాండ్ పెరిగింది. పరీక్షా తేదీ (మార్చి 5), ఇంటర్న్‌షిప్ పూర్తి గడువు మధ్య చాలా గ్యాప్ ఉన్నందున, విద్యార్థులు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. NEET PG 2023ని వాయిదా వేయాలని కోరుతూ భారత సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు దాఖలు చేయబడింది. విచారణ 3-4 రోజుల్లో జరుగుతుందని భావిస్తున్నారు.

లేటెస్ట్ Education News కోసం, కాలేజీ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు ఇక్కడ కూడా మాకు రాయవచ్చు news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/telangana-high-court-hearing-on-neet-pg-2023-postponement-first-hearing-latest-updates-proceedings-36674/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

ఎగ్జామ్ అప్డేట్ మిస్ అవ్వకండి !!

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!