తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫీజు తేదీలు 2024 (Telangana Inter Exam Fee Dates) : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ( Telangana Inter Exam Fee Dates) తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజును ఆలస్య ఫీజు లేకుండా నవంబర్ 6వ తేదీ నుంచి ఈ నెల 26 వరకు చెల్లించవచ్చు. అదేవిధంగా రూ. 100ల ఆలస్య ఫీజుతో నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 4 వరకు చెల్లించవచ్చు. రూ. 500 ఆలస్య ఫీజుతో డిసెంబర్ 5 నుంచి 11 వరకు, రూ. 1000 ఆలస్య ఫీజుతో డిసెంబర్ 12వ తేదీ నుంచి 18 వరకు, రూ.2,000 ఆలస్య ఫీజుతో డిసెంబర్ 19 నుంచి 27 వరకు చెల్లించవచ్చు.
తెలంగాణ ఇంటర్మీడియట్ కొత్త ఫీజులు (New Inter Exam Fee in Telangana)
తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫీజు కొంచెం పెరిగింది. ఈ మేరకు సాధారణ కోర్సులు చదివే మొదటి సంవత్సరం విద్యార్థులు గతేడాది రూ.510తో పోలిస్తే ఇప్పుడు రూ.520 చెల్లించాల్సి ఉంటుంది. వృత్తివిద్యా కోర్సులకు రూ.750, థియరీకి రూ.520, ప్రాక్టికల్స్‌కు రూ.230 చొప్పున కొత్త ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ముఖ్యమైన తేదీలు 2024 (Important Dates for Telangana Inter Exam Fee Payment 2024)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫీజు చెల్లింపు కోసం ముఖ్యమైన తేదీలు ఈ దిగువున అందించాం.ఇంటర్మీడియట్ పరీక్షా ఫీజు చెల్లించిపునకు ప్రారంభ తేదీ | నవంబర్ 6, 2024 |
---|---|
ఇంటర్మీడియట్ పరీక్షా ఫీజు చెల్లించిపునకు చివరి తేదీ | నవంబర్ 26, 2024 |
ఆలస్య ఫీజు రూ.100లతో ప్రారంభ తేదీ | నవంబర్ 27, 2024 |
ఆలస్య ఫీజు రూ.100తో చివరి తేదీ | డిసెంబర్ 4, 2024 |
ఆలస్య ఫీజు రూ.500లతో ప్రారంభ తేదీ | డిసెంబర్ 5, 2024 |
ఆలస్య ఫీజు రూ.500లతో చివరి తేదీ | డిసెంబర్ 11, 2024 |
ఆలస్య ఫీజు రూ.1,000లతో ప్రారంభ తేదీ | డిసెంబర్ 12, 2024 |
ఆలస్య ఫీజు రూ.1000లతో చివరి తేదీ | డిసెంబర్ 18, 2024 |
ఆలస్య ఫీజు రూ.2,000 లతో ప్రారంభ తేదీ | డిసెంబర్ 19, 2024 |
ఆలస్య ఫీజు రూ.2000లతో చివరి తేదీ | డిసెంబర్ 27, 2024 |
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.