తెలంగాణ NEET UG ఫేజ్ 1 సీట్ల కేటాయింపు అంచనా విడుదల తేదీ 2024 (Telangana NEET UG Phase 1 Seat Allotment Expected Release Date 2024) : కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, తెలంగాణా ఫేజ్ 1 కోసం వెబ్ ఎంట్రీ ప్రక్రియను అక్టోబర్ 1న ముగించింది. త్వరలో సీట్ల కేటాయింపులను విడుదల చేస్తుంది. తెలంగాణ నీట్ యూజీ ఫేజ్ 1 సీట్ల కేటాయింపు విడుదల తేదీని అధికారులు ఇంకా నిర్ధారించ లేదు. సాధారణంగా వెబ్ ఆప్షన్ల తర్వాత వారంలోపు సీట్ల కేటాయింపులు ప్రారంభమవుతాయి. కాబట్టి, తెలంగాణా నీట్ UG ఫేజ్ 1 సీటు కేటాయింపు 3 నుండి 5 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 5, 2024 నాటికి విడుదలవుతుంది.
తెలంగాణ NEET UG ఫేజ్ 1 సీటు కేటాయింపు జాబితా విడుదల తేదీ 2024 (అంచనా) (Telangana NEET UG Phase 1 Seat Allotment Expected Release Date 2024)
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డెంటల్ కాలేజీలు, ఆర్మీ డెంటల్ కాలేజీలలో BDS అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులు ఈ క్రింది టేబుల్‌లో మొదటి దశ సీట్ల కేటాయింపు యొక్క ఊహించిన విడుదల తేదీని చెక్ చేయవచ్చు.
ఈవెంట్ | తేదీలు |
---|---|
తెలంగాణ నీట్ UG ఫేజ్ 1 సీట్ల కేటాయింపు విడుదల తేదీ 2024 | అక్టోబర్ 5, 2024 నాటికి అంచనా వేయబడింది |
వెబ్ ఆప్షన్లు, సీటు కేటాయింపు తర్వాత ఆశించిన గ్యాప్ పీరియడ్ | సాధారణంగా 3 నుంచి 5 రోజులు |
సీట్ల కేటాయింపు ఫలితాలను డౌన్‌లోడ్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ | knruhs.telangana.gov.in |
గేట్‌వే పద్ధతి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ చెల్లింపు ఆప్షన్లను ఉపయోగించి విశ్వవిద్యాలయ ఫీజు చెల్లించిన తర్వాత, అభ్యర్థులు తమ కేటాయింపును చెక్ చేయవచ్చు. అప్పుడు వారు అలాట్‌మెంట్ లెటర్‌పై పేర్కొన్న తేదీలో లేదా అంతకంటే ముందు వారి సంబంధిత డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు రిపోర్ట్ చేయాలి. ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా పేర్కొన్న చివరి తేదీకి ముందు సంబంధిత డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు రిపోర్ట్ చేయాలి, ఒరిజినల్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాలి. అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ట్యూషన్/ లేదా కాలేజీ ఫీజు చెల్లించాలి. అలా చేయడంలో విఫలమైతే అడ్మిషన్ స్వయంచాలకంగా రద్దు చేయబడుతుంది మరియు సీట్ బ్లాకింగ్‌ను నివారించడానికి తదుపరి దశల కౌన్సెలింగ్, అడ్మిషన్ కోసం అభ్యర్థి ఎంపికలు పరిగణించబడవు.