ఏపీ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల తేదీ ( AP EAPCET 2023 Application Release Date) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ , మెడిసిన్ , అగ్రికల్చర్ కోర్సులలో జాయిన్ అవ్వడానికి వ్రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ AP EAPCET. గతంలో ఉన్న ఎంసెట్ ( AP EAMCET) పేరును అధికారులు AP EAPCET గా మార్చారు. ప్రతీ సంవత్సరం సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష కు హాజరు అవుతారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలలో సీట్ల భర్తీ కోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఏపీ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ ఫిబ్రవరి నెలలో విడుదల అవుతుంది, విద్యార్థులు అధికారిక వెబ్సైట్ sche.ap.gov.in లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏపీ ఎంసెట్ 2023 ( AP EAMCET 2023) పరీక్ష మే 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ కు , మే 23 నుండి 25 వరకు అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ కు పరీక్షలు జరుగుతాయి.
ఏపీ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల, రిజిస్ట్రేషన్ ఫీజు, పరీక్ష తేదీల గురించి మరింత ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
ఇవి కూడా చదవండి -
ఏపీ ఎంసెట్ 2023 పరీక్ష తేదీలు
ఏపీ ఎంసెట్ 2023 ముఖ్యమైన తేదీలు ( AP EAPCET 2023 Important Dates)
ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 (AP EAMCET 2023 Application) కు సంబందించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టిక లో వివరంగా తెలుసుకోవచ్చు.
కార్యక్రమం | తేదీ |
---|---|
ఏపీ ఎంసెట్ (AP EAPCET) నోటిఫికేషన్ | ఫిబ్రవరి 2023 |
ఏపీ ఎంసెట్ (AP EAPCET) రిజిస్ట్రేషన్ ప్రారంభం | ఫిబ్రవరి 2023 |
ఏపీ ఎంసెట్ (AP EAPCET) రిజిస్ట్రేషన్ చివరి తేదీ | మార్చి 2023 |
ఏపీ ఎంసెట్ (AP EAPCET) హాల్ టికెట్ విడుదల | ఏప్రిల్ 2023 |
ఏపీ ఎంసెట్ (AP EAPCET) పరీక్ష తేదీలు | మే15 నుండి 25 వరకు |
ఏపీ ఎంసెట్ (AP EAPCET) కౌన్సెలింగ్ | జూన్ / జూలై 2023 |
ఏపీ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ ఫీజు ( AP EAMCET 2023 Registration Fee)
ఏపీ ఎంసెట్ 2023 కు రిజిస్టర్ చేసుకుంటున్న అభ్యర్థులు చెల్లించాల్సిన ఫీజు వివరాలు కేటగిరీ ప్రకారంగా క్రింద పట్టిక లో తెలుసుకోవచ్చు.
కేటగిరీ | ఇంజనీరింగ్ | అగ్రికల్చర్ | ఫార్మసీ |
---|---|---|---|
జనరల్ అభ్యర్థులు | 600 /- | 600/- | 600/- |
BC | 500/- | 500/- | 500/- |
SC / ST | 300/- | 300/- | 300/- |
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కూడా ఏపీ ఎంసెట్ పరీక్ష కు అప్లై చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి -
ఏపీ ECET 2023 ఎగ్జామ్ షెడ్యూల్
ఏపీ ఎంసెట్ గురించిన మరిన్ని వివరాల కోసం
CollegeDekho
ను ఫాలో అవ్వండి.