JEE మెయిన్ 24 జనవరి 2023 షిఫ్ట్ (JEE Main January 24 2023 Question Paper Analysis) 1 పరీక్ష ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు జరిగింది. షిఫ్ట్ 1 ప్రశ్న పేపర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి మొత్తం 90 ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా ప్రశ్నపత్రం ఫార్మాట్ MCQ ఫార్మాట్‌లో ఉంది. అధికారిక JEE మెయిన్ 2023 జవాబు కీ తేదీ సెషన్ 1 పరీక్ష ముగిసిన మూడు రోజుల్లోపు విడుదల చేసే అవకాశం ఉంది.
JEE మెయిన్ సెషన్ 1 పరీక్ష పేపర్‌పై ముఖ్యమైన అంశాలు (Major Highlights of JEE Main Session 1 Exam Paper)
- పేపర్ మోడరేట్ నుంచి కష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది
- ఫిజిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు చాలా కష్టంగా ఇవ్వడం జరిగింది.
- మ్యాథ్స్ నుంచి సులభమైన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది.
- కెమిస్ట్రీ నుంచి మోడరేట్ నుంచి కష్టమైన ప్రశ్నలు ఇచ్చారని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
- కెమిస్ట్రీ అధ్యాయంలో మెమరీ ఆధారిత డైరక్ట్ NCERT ప్రశ్నలు ఇచ్చారు.
- ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమిస్ట్రీ విభాగంలో సంఖ్యాపరమైన ప్రశ్నలు ఉన్నాయి
- ఫిజిక్స్ విభాగంలో చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫోములా ఆధారిత ప్రశ్నలు ఉన్నాయి
- గణిత విభాగంలో వెక్టర్ 3D అధ్యాయం నుంచి చాలా ప్రశ్నలు ఉన్నాయి
- గణిత విభాగం NAT ప్రశ్నలు lengthy,గా, MCQ భాగం మోడరేట్‌గా ఉంది
- ఫిజిక్స్ విభాగంలో "ఫైండ్ ది టెన్షన్ ఆఫ్ ఎ స్ట్రింగ్" గణన ఆధారిత ప్రశ్న ఉంది
JEE మెయిన్ 24 జనవరి 2023 షిఫ్ట్ 1 పరీక్ష విశ్లేషణ (JEE Main 24 January 2023 Shift 1 Exam Analysis)
జేఈఈ మెయిన్ 2023కి (JEE Main 2023) షిఫ్ట్ 1కు సంబంధించిన పరీక్ష విశ్లేషణ ఈ దిగువున ఇవ్వడం జరిగింది. విద్యార్థులు, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ ఎనాలిసిస్‌ను అందించడం జరిగింది.
సెక్షన్ | వివరాలు |
---|---|
మొత్తంగా క్లిష్టత స్థాయి | మోడరేట్ |
ఫిజిక్స్ పేపర్ క్లిష్టత స్థాయి | చాలా కష్టంగా ఉంది |
కెమిస్ట్రీ పేపర్ క్లిష్టత స్థాయి | కొంచెం కష్టంగా ఉంది |
గణితం పేపర్ క్లిష్టత స్థాయి | సులభంగా ఉంది |
NAT ప్రశ్నల క్లిష్టత స్థాయి | తెలియాల్సి ఉంది |
గణితంలో ఎక్కువ వెయిటేజీ ఉన్న టాపిక్స్ |
వెక్టర్ ఆల్జిబ్రా (Vector Algebra)
3డీ జామిట్రీ (3D Geometry) అనుసంధానం (Integration) సమగ్ర కాలిక్యులేస్ (Integral Calculus) త్రికోణమితి (Trigonometry) |
ఫిజిక్స్‌లో ఎక్కువ వెయిటేజీ ఉన్న టాపిక్స్ |
గతి శాస్త్రం (Kinematics)
యూనిట్లు, కొలతలు (Units & Dimensions) సెమి కండక్టర్స్ (Semiconductors) కమ్యూనికేషన్ వ్యవస్థలు (Communication systems) విద్యుదయస్కాంత తరంగాలు (Electromagnetic waves) |
కెమిస్ట్రీలో ఎక్కువ వెయిటేజీ ఉన్న టాపిక్స్ |
జీవ అణువులు (Biomolecules)
అకర్భన రసాయన శాస్త్రం (Inorganic Chemistry) కర్భన రసాయన శాస్త్రం (Organic Chemistry) ఫిజికల్ కెమిస్ట్రీ (Physical Chemistry) అకర్భన (Inorganic) పాలిమర్లు (Polymers) |
జేఈఈ మెయిన్ 2023 (JEE Main 2023) పరీక్షలకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం College Dekhoను చూడవచ్చు.