TG EDCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024 ( TG EDCET Counselling Process 2024) : తెలంగాణా విద్యామండలి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EdCET 2024) కోసం కౌన్సెలింగ్ నమోదు ప్రక్రియను (TG EDCET Counselling Process 2024) తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రారంభిస్తుంది. అభ్యర్థులు ఆగస్టు 8వ తేదీ నుంచి TG EdCET కౌన్సెలింగ్ ఫార్మ్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, సీట్ల కేటాయింపు ప్రక్రియలో భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 800 (SC/ST అభ్యర్థులకు రూ. 500) చెల్లించాలి. అధికారిక షెడ్యూల్ ప్రకారం, అధికారిక వెబ్‌సైట్‌లో TG EDCET కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ 2024కి చివరి తేదీ ఆగస్టు 20, 2024. ముఖ్యమైన తేదీలతో పాటు దరఖాస్తు చేయడానికి ముఖ్యమైన సూచనలను ఇక్కడ చూడొచ్చు.
TG EdCET కౌన్సెలింగ్ 2024 నమోదు తేదీలు (TG EdCET Counselling 2024 Registration Dates)
ఆగస్టు 8 నుండి ప్రారంభం కానున్న TG EDCET కౌన్సెలింగ్ ఫారమ్ 2024 కోసం ముఖ్యమైన రిజిస్ట్రేషన్ తేదీలు ఇక్కడ ఉన్నాయి -
TG EdCET కౌన్సెలింగ్ 2024 ఈవెంట్స్ | తేదీలు |
---|---|
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ | ఆగస్ట్ 8, 2024 |
TG EDCET కౌన్సెలింగ్ నమోదును పూరించడానికి చివరి తేదీ | ఆగస్టు 20, 2024 |
ప్రత్యేక కేటగిరి, ఫిజికల్ ధ్రువీకరణ | ఆగస్టు 12వ తేదీ నుంచి 16, 2024 వరకు |
అధికారిక వెబ్‌సైట్ | www.edcetadm.TGche.ac.in |
TG EDCET కౌన్సెలింగ్ 2024: నమోదు చేయడానికి దశలు
TG EDCET 2024 కోసం కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌లో ఉన్న ముఖ్యమైన దశలను దిగువన చూడండి: -
- కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవడానికి, సీటును నిర్ధారించుకోవడానికి క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ఫీజును చెల్లించాలి. TS EDCET హాల్ టికెట్ నెంబర్ తప్పనిసరి.
- ఫీజు చెల్లింపు తర్వాత, అభ్యర్థి TS EDCET హాల్ టికెట్ నెంబర్‌ను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ చేయాలి.
- రిజర్వ్ చేయబడిన కేటగిరీల ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు TCHE నిర్వహించే ఆన్‌లైన్ ధ్రువీకరణ ప్రక్రియ ద్వారా వెళ్లాలి
- అభ్యర్థులు TG EdCET కౌన్సెలింగ్ ఫీజు 2024 విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్లను ఉపయోగించాలి.
- వెబ్ ఆప్షన్లను ఫ్రీజ్ చేసుకోవాలి. ఫేజ్ 1 సీట్ల కేటాయింపు ఫలితాలను కౌన్సిల్ విడుదల చేసే వరకు వెయిట్ చేయాలి.