TGCAB DCCB రిక్రూట్‌మెంట్ 2024 (TGCAB DCCB Recruitment 2024): తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (TGCAB) రాష్ట్రంలో కో ఆపరేటివ్ ఇంటర్న్స్ (CIలు) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30వ తేదీనే చివరి తేదీ. ఈ పోస్టుల కోసం అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలేంటో.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో వంటి పూర్తి వివరాలు ఇక్కడ అందించాం.
TGCAB DCCB రిక్రూట్‌మెంట్ 2024 మొత్తం ఖాళీల సంఖ్య (TGCAB DCCB Recruitment 2024 Total Vacancies)
TGCAB DCCB రిక్రూట్‌మెంట్ 2024 మొత్తం ఖాళీల సంఖ్య ఈ దిగువున అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (TGCAB) | 01 |
---|---|
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (TGCAB): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB) | 09 |
TGCAB DCCB రిక్రూట్‌మెంట్ 2024 అర్హతలు (TGCAB DCCB Recruitment 2024 Eligibility)
TGCAB DCCB రిక్రూట్‌మెంట్ 2024కు సంబంధించిన అర్హత ప్రమాణాలు ఈ దిగువున అందించాం. అభ్యర్థులు చూడవచ్చు.- కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్, అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఎంబీఏ చేసి ఉండాలి. లేదా AICTE/UGCచే గుర్తింపు పొందిన 2 సంవత్సరాల PGDMలో తత్సమానం పొంది ఉండాలి.
- కంప్యూటర్ వినియోగం, తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఈ పోస్టులకు ఎంపికైనా అభ్యర్థులకు నెలకు రూ.25 వేల రూపాయల వరకు వేతనం ఉంటుంది.