TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ విడుదల తేదీ 2024 (TGPSC Group 2 Hall Ticket Release Date 2024) :
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ పరీక్షను డిసెంబర్ 15, 16 2024 తేదీల్లో నిర్వహించనుంది. ీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాల కోసం ఈ పరీక్ష్ను నిర్వహించడం జరుగుతుంది. TSPSC గ్రూప్ 2 పరీక్షా తేదీ దగ్గర పడుతుండడంతో హాల్ టికెట్ల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ (TGPSC Group 2 Hall Ticket Release Date 2024) .. పరీక్షలో పాల్గొనడానికి అభ్యర్థుల గుర్తింపుగా, అధికారిక ధ్రువీకరణగా ఉపోగపడతుుంది.
TSPSC గ్రూప్ 2 పరీక్ష హాల్ టికెట్‌లో అభ్యర్థుల పేరు, పరీక్షా కేంద్రం, సీటు నెంబర్‌తో సహా పూర్తి వివరాలు ఉంటాయి. ఈ హాల్ టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయో.. అంచనాగా ఇక్కడ అందించాం.
TSPSC గ్రూప్ 2, 2024 హాల్ టికెట్లు డిసెంబర్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. హాల్ టికెట్లను TSPSC సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో
www.tspsc.gov.in
విడుదల చేయనుంది. డిసెంబర్ 9వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడినా.. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు దొర్లినా 040-23542185 లేదా 040-23542187 నెంబర్లకు సంప్రదించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. లేదా Helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్ ద్వారా మెసెజ్‌లు పంపవచ్చని పేర్కొంది.
TSPSC గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ 2024 (TSPSC Group 2 Exam Date 2024)
TSPSC గ్రూప్ 2 పరీక్ష 2024 తేదీని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 15చ 16 డిసెంబర్ 2024 తేదీల్లో వివిధ పరీక్షా కేంద్రాలలో 783 ఖాళీల భర్తీకి నిర్వహించబడుతుంది.
15 డిసెంబర్ 2024
- పేపర్ 1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్
- సమయం: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు
- పేపర్ 2: చరిత్ర, రాజకీయాలు, సమాజం
- సమయం: మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:30 వరకు
16 డిసెంబర్ 2024
- పేపర్ 3: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
- సమయం: ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
- పేపర్ 4: తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు
- సమయం: మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:30 వరకు