టీజీసెట్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తేదీలు : తెలంగాణ స్టేట్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నవంబర్ 30వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. టీజీసెట్ పరీక్షలో మొత్తం 29 సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 03వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆన్లైన్ వెరిఫికేషన్ సెంటర్ కు హాజరయ్యి సర్టిఫికెట్స్ పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
టీజీసెట్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తేదీలు 2024 ( TGSET Certificate Verification Dates 2024)
అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన టేబుల్ నుండి టీజీసెట్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తేదీలను వివరంగా తెలుసుకోవచ్చు.అంశం | తేదీ |
---|---|
టీజీసెట్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రారంభ తేదీ | 30 నవంబర్ 2024 |
టీజీసెట్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ముగింపు తేదీ | 03 డిసెంబర్ 2024 |
టీజీసెట్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అవసరమైన పత్రాల జాబితా ( Required Documents For TGSET Certificate Verification 2024)
టీజీసెట్ 2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ క్రింది పత్రాలను తప్పనిసరిగా వెరిఫికేషన్ కేంద్రానికి తీసుకునివెళ్ళాలి.- పదో తరగతి మార్క్స్ షీట్
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ షీట్
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్
- టీజీసెట్ 2024 స్కోరు కార్డు
- కుల ధ్రువీకరణ పత్రం
- EWS సర్టిఫికెట్ ( అవసరమైన వారికి)
- PH సర్టిఫికెట్ ( శారీరక వికలాంగులకు)
- పైన జాబితాలో ఉన్న అన్నీ పత్రాలు రెండు సెట్లు జిరాక్స్ కాపీలు కూడా తీసుకుని వెళ్ళాలి .