తెలంగాణ పదో తరగతి ఎగ్జామ్ ప్యాట్రర్న్‌లో మార్పులు (TS 10th Class Exam Pattern Changes) :
తెలంగాణ విద్యాశాఖ 10వ తరగతి పరీక్షల విధానంలో మార్పులు చేసింది. ఇందులో భాగంగా ఇక నుంచి విద్యార్థులు ప్రస్తుతం 80 మార్కుల ప్రశ్నాపత్రం కాకుండా 100 మార్కుల ప్రశ్నపత్రాన్ని తయారు చేయనున్నారు. ఇంతకు ముందు వరకు మార్కులు లెక్కించే విధానంలో రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నెల్ మూల్యాంకనానికి 20 మార్కులు ఉండేవి. అయితే ఇప్పుడు విద్యాశాఖ ఇంటర్నల్ మార్కుల విధానం తొలగించింది. విద్యార్థులు ఇప్పుడు రాత పరీక్షలలో వారి పనితీరు ఆధారంగా పూర్తిగా గ్రేడ్ చేయబడతారు.
మార్కులు లెక్కించే ప్రక్రియను సులభతరం చేయడానికి, పాఠశాలల్లో స్థిరమైన మూల్యాంకన విధానాన్ని రూపొందించడానికి ఈ మార్పును చేయడం జరిగింది. కొత్తగా సవరించిన విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. అయితే ఈ నిర్ణయం విద్యావేత్తలు, తల్లిదండ్రులలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు దీనిని ఎక్కువ ట్రాన్స్‌పరెంట్ అంటూ సానుకూలంగా స్పందించారు. మరికొందరు దీనిని నెగిటివ్‌గా తీసుకున్నారు. అప్‌డేట్ చేయబడిన సిలబస్, పరీక్షల షెడ్యూల్‌ల గురించి అదనపు వివరాలను విద్యా శాఖ త్వరలో విడుదల చేయనుంది.
అంతేకాకుండా ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల ఫలితాలను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే గ్రేడింగ్ విధానం కూడా రద్దు చేస్తుంది. ఇంటర్నెల్ మూల్యాంకనాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్పులో భాగంగా విద్యార్థులు ఇప్పుడు వారి చివరి పరీక్షల కోసం 24 పేజీల సమాధానాల బుక్‌లెట్‌లను అందుకుంటారు. ఈ మేరకు విద్యార్థులకు సమాచారం ఇవ్వాలని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లిపు తేదీలను కూడా ఇటీవల వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా నవంబర్ 18వ తేదీ వరకు చెల్లించవచ్చు. ఫీజు గడువును నవంబర్ 28వ తేదీ వరకు పొడిగించింది. ఆ తర్వాత రూ.50 లేట్ ఫీజుతో డిసెంబర్ 12వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అదే విధంగా రూ. 200 ఆలస్య ఫీజుతో డిసెంబర్ 12వ తేదీ వరకు, రూ. 200 ఆలస్య ఫీజుతో డిసెంబర్ 19వ తేదీ వరకు.. రూ.500 ఆలస్య ఫీజుతో డిసెంబర్ 30 వరకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.25 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.