తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023): తెలంగాణ పాలిసెట్ 2023 దరఖాస్తు ఫారమ్ (TS POLYCET 2023 APPLICATION) జనవరి 16న విడుదలైంది.
తెలంగాణ పాలిసెట్ 2023కి అధికారిక వెబ్‌సైట్
polycet.sbtet.telangana.gov.inలో అందుబాటులో ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ 2023 (TS POLYCET 2023)ని నిర్వహిస్తారు. తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023) నోటిఫికేషన్ జనవరి 11వ తేదీన విడుదలైంది.
అభ్యర్థులు
ఈ ప్రవేశ పరీక్షకు జనవరి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన సమాచారం మేరకు మే 17న పాలిసెట్ 2023 ఎగ్జామ్ ఉంటుంది.
తెలంగాణ పాలిసెట్ 2023 దరఖాస్తు ఫారమ్ ( TS POLYCET 2023 Application Form (డైరక్ట్ లింక్ యాక్టివేటెడ్) )- |
---|
తెలంగాణ పాలిసెట్ 2023 దరఖాస్తు విధానం (TS POLYCET 2023 Application Process)
తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023)కి హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. TS POLYCET 2023 (Telangana State Polytechnice Common Entrance Test)కి అప్లికేషన్ అధికారిక వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు గడువు తేదీలోపే దరఖాస్తును పూరించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. TS POLYCET 2023లో వచ్చిన ర్యాంకు, స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు ప్రైవేట్, ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలను కల్పించడం జరుగుతుంది.
తెలంగాణ పాలిసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (TS POLYCET 2023 Important Dates)
తెలంగాణ పాలిసెట్ 2023 అప్లికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు (TS POLYCET Application Form 2023 Dates) ఈ దిగువన ఇవ్వడం జరిగింది.
కార్యక్రమం | ముఖ్యమైన తేదీలు |
---|---|
దరఖాస్తు ఫారమ్ విడుదల | జనవరి 16, 2023 |
దరఖాస్తుకు గడువు తేదీ | ఏప్రిల్ 24, 2023 |
ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ | ఏప్రిల్ 25, 2023 |
హాల్ టికెట్ విడుదల | మే రెండో వారం |
పరీక్షా తేదీ | మే 17, 2023 |
తెలంగాణ పాలిసెట్ 2023 దరఖాస్తు విధానం (TS POLYCET Application Form 2023 Steps to Apply)
తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023) మే 17వ తేదీన నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షకు పదో తరగతి పూర్తైన, చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.100 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అభ్యర్థులకు ఈ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఉండాలి. వాటి ద్వారా polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఫీజు చెల్లించాల్సిన పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు సంబంధిత వివరాలు ఇచ్చి ఫీజు పే చేయాలి.
ఫీజు కట్టిన తర్వాత దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలు ఇచ్చి అప్లికేషన్‌ను పూరించాలి.
అప్లికేషన్ పూరించిన తర్వాత అభ్యర్థుల తమ డాక్యుమెంట్లను, ఫోటో కాపీ, సిగ్నేచర్‌ను అప్‌లోడ్ చేయాలి.
తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023) దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. తెలంగాణ పాలిసెట్ 2023 నిర్వహించిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నట్టు అధికారులు ప్రకటించారు.
తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023) సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ గురించి College Dekhoని చూస్తూ ఉండండి.