టీఎస్‌పీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 (TS Agriculture Officer Hall Ticket 2023): తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఏప్రిల్ 25, 2023న అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షను నిర్వహించనుంది. TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ (TS agriculture officer hall ticket 2023) త్వరలో విడుదల కానుంది. అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in నుంచి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులందరూ తమ TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ (TS agriculture officer hall ticket 2023) ప్రింటెడ్ కాపీని పరీక్ష రోజున పరీక్షా కేంద్రానికి తీసుకురావడం తప్పనిసరి.హాల్ టికెట్ కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ని చెక్ చేస్తూ ఉండాలి.
టీఎస్‌పీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ 2023 (TSPSC Agriculture Officer 2023)
టీఎస్‌పీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ పరిశీలించవచ్చు.నిర్వహించే సంస్థ పేరు | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) |
---|---|
పోస్ట్ పేరు | అగ్రికల్చర్ ఆఫీసర్ |
పోస్టుల సంఖ్య | 148 |
అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ రిలీజ్ స్టేటస్ | త్వరలో విడుదల |
అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీ | ఏప్రిల్ 25, 2023 |
జాబ్ లోకేషన్ | తెలంగాణ |
సెలక్షన్ విధానం | రాత పరీక్ష |
అధికారిక వెబ్‌సైట్ | www.tspsc.gov.in |
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download the TSPSC Agriculture Officer Hall Ticket 2023?)
అభ్యర్థులు TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్‌ని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఈ దిగువున తెలియజేసిన స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి.
- ముందుగా అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్‌కి www.tspsc.gov.inని సందర్శించాలి.
- హోంపేజీలో హాల్ టికెట్‌కు సంబంధించిన లింక్‌ని గుర్తించాలి.
- "TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేయండి” లేదా “TS AO హాల్ టికెట్ 2023” అని చెప్పే లింక్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వాలి
- అభ్యర్థులు ఇచ్చిన వివరాల ఆధారంగా హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
- హాల్ టికెట్‌లో అభ్యర్థులు తమ పేరు, ఫోటో, పరీక్ష తేదీ, సమయం, సెంటర్‌ని చెక్‌చేసుకోవాలి.
- తర్వాత హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుని దగ్గర పెట్టుకోవాలి.
మరిన్ని తెలుగులో ఎడ్యుకేష్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.