టీఎస్ దోస్త్ 2024 నోటిఫికేషన్ (TS DOST Notification 2024) : తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో జాయిన్ అయ్యేందుకు కౌన్సెలింగ్ నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (TS DOST 2024) నోటిఫికేషన్ (TS DOST Notification 2024) శుక్రవారం అంటే మే 3వ తేదీన రిలీజ్ అయింది. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం మూడు విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియ సాగుతుంది. TS DOST 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 6వ తేదీ నుంచి మే 25 వరకు సాగుతుంది. అలాగే రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 4వ తేదీ నుంచి 13 వరకు, మూడో విడుత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 25 వరకు జరుగుతుంది. టీఎస్ దోస్త్‌కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, వివరాలు ఈ దిగువున అందించాం.
టీఎస్ దోస్త్ 2024 ముఖ్యమైన తేదీలు (TS DOST 2024 Important Dates)
టీఎస్ దోస్త్ 2024 ముఖ్యమైన తేదీల గురించి ఈ దిగువున టేబుల్లో అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.ఈవెంట్ | తేదీ |
---|---|
అధికారిక TS DOST అడ్మిషన్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది | మే 03, 2024 |
మొదటి దశ TS DOST 2024 నమోదు తేదీలు | మే 6 నుంచి 25 2024 వరకు |
వెబ్ ఎంపికలు – దశ 1 | మే 15 నుంచి మే 27, 2024 వరకు |
సీట్ల కేటాయింపు - ఫేజ్ 1 | జూన్ 03, 2024 |
ఫేజ్ 1 రిపోర్టింగ్ | జూన్ 4 నుంచి 10, 2024 వరకు |
ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ | జూన్ 4 నుంచి 13, 2024 వరకు |
ఫేజ్వె 2 వెబ్ ఆప్షన్లు | జూలై 2024 |
ఫేజ్ 2 సీట్ల కేటాయింపు | జూన్ 18, 2024 |
ఫేజ్ 2 రిపోర్టింగ్ | జూన్ 19 నుండి 24, 2024 వరకు |
ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ | జూన్ 19 నుండి 25, 2024 వరకు |
ఫేజ్ 3 వెబ్ ఆప్షన్లు | జూన్ 19 నుండి 26, 2024 వరకు |
ఫేజ్ 3 సీట్ల కేటాయింపు | జూన్ 29, 2024 |
రిపోర్టింగ్ | జూలై 03, 2024 |
TS DOST రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 (TS DOST Registration 2024 Process)
TS DOST రిజిస్ట్రేషన్ విధానం గురించి ఈ దిగువున వివరంగా అందించాం. అభ్యర్థులు ఈ విధానాన్ని ఫాలో అయి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు పొందాలనుకునే అభ్యర్థులు ముందుగా దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.inని సందర్శించాలి.
- హోంపేజీలో "Candidate Pre-Registration" అని ఉండే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టాలి.
- ముందుగా Application Fee Payment ఆప్షన్‌ను ఎంచుకుని, ఫీజును చెల్లించాలి.
- తర్వాత Candidate Login ద్వారా ఆప్షన్లను ఎంచుకోవాలి.