తెలంగాణ డీఎస్సీ అప్లికేషన్ చివరి తేదీ 2024 (TS DSC Application Last Date 2024) : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దరఖాస్తు (TS DSC Application Last Date 2024) గడువును పొడిగిస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో 11,062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. TS DSC 2024 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ https://schooledu.telangana.gov.in/లో కొనసాగుతోంది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు డీఎస్సీ దరఖాస్తులను జూన్ 20 వరకు పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటిస్తుంది. దీంతోపాటు డీఎస్సీ పరీక్షల (TS DSC Exam Schedule) తేదీలను అధికారులు ఖరారు చేశారు. జూలై 17 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. జూలై 17 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది.
TS DSC 2024 నోటిఫికేషన్ - ముఖ్యమైన తేదీలు (TS DSC 2024 Notification- Important Dates)
డైరక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ TS DSC పరీక్ష 2024 కోసం నమోదు షెడ్యూల్‌ను https://schooledu.telangana.gov.in/లో విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర TRT DSC ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 20 జూన్ 2024 వరకు పొడిగించబడింది. TS DSC పరీక్షలు 17 నుంచి 31 జూలై 2024 వరకు జరగనున్నాయి. ఈ దిగువ పట్టిక నుంచి ముఖ్యమైన తేదీలను చెక్ చేయవచ్చు.ఈవెంట్లు | ముఖ్యమైన తేదీలు |
---|---|
టీఎస్ డీఎస్సీ నోటిఫికేషన్ 2024 విడుదల తేదీ | ఫిబ్రవరి 29, 2024 |
DSC TRT దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తేదీ | మార్చి 04, 2024 |
TS DSC 2024 దరఖాస్తుకు చివరి తేదీ | జూన్ 20, 2024 (పొడిగింపు) |
TS DSC ఫీజు పేమంట్‌కి చివరి తేదీ | జూన్ 19, 2024 |
TS DSC పరీక్షా తేదీలు 2024 | జూలై 17 నుంచి 31 జూలై 2024 |
తెలంగాణ డీఎస్సీ 2024 ఎంపిక ప్రక్రియ (TS DSC 2024 Selection Process)
TS DSC నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT), స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల ఎంపిక ప్రమాణాలు మూడు దశలను కలిగి ఉంటాయి. అభ్యర్థులు దిగువున తెలిపిన దశలలో వారి ప్రదర్శనల ఆధారంగా ఎంపిక చేయబడతారు.- స్టెప్ 1- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- స్టెప్ 2- వ్యక్తిగత ఇంటర్వ్యూ (PI) /డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్టెప్ 3- ఫైనల్ మెరిట్ లిస్ట్