టీఎస్ ఎంసెట్ 2023 దరఖాస్తుకు నేడే లాస్ట్‌డేట్ (TS EAMCET Application form 2023 Closing Today): తెలంగాణ ఎంసెట్ 2023 దరఖాస్తు ఫార్మ్ సబ్మిట్ చేయడానికి ఈరోజే లాస్ట్‌డేట్. అభ్యర్థులు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి ఈరోజే (ఏ్రప్రిల్ 10, 2023) చివరి తేదీ. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి eamcet.tsche.ac.in లో వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
టీఎస్ ఎంసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (TS EAMCET 2023 Important Dates)
తెలంగాణ ఎంసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.ఆలస్య రుసుము లేకుండా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 10, 2023 |
---|---|
దరఖాస్తు కరెక్షన్ విండో | ఏప్రిల్ 12 నుంచి 14, 2023 |
రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ | ఏప్రిల్ 15, 2023 |
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ | ఏప్రిల్ 20, 2023 |
రూ.2,500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ | ఏప్రిల్ 25, 2023 |
రూ.5000 లేట్ ఫీజుతో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ | మే 02, 2023 |
TS EAMCET 2023 హాల్ టికెట్ విడుదల తేదీ | ఏప్రిల్ 30, 2023 |
TS EAMCET 2023 పరీక్ష తేదీ |
అగ్రికల్చర్, మెడిసిన్ మే 10, 11, 2023
ఇంజనీరింగ్ మే 12, 13, 14, 2023 |
TS EAMCET 2023 - ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to apply to TS EAMCET 2023)
తెలంగాణ ఎంసెట్ 2023కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన స్టెప్స్ ఫాలో అవ్వాలి.- అధికారిక వెబ్‌సైట్‌ను eamcet.tsche.ac.in సందర్శించాలి
- హోమ్‌పేజీలో "submit the application fee" అనే లింక్‌పై క్లిక్ చేయాలి
- ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు తమ పూర్తి వివరాలు పూరించాలి
- తర్వాత అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ సూచనల కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.