TS EAMCET 2023 Exam Dates: విద్యార్థులకు అలర్ట్.. టీఎస్ ఎంసెట్ 2023 పరీక్షల షెడ్యూల్ ఇదే
తెలంగాణ ఎంసెట్ 2023 ఎగ్జామ్ డేట్స్ విడుదల ( TS EAMCET 2023 Exam Dates):
తెలంగాణలో ఎంసెట్ 2023 ఎగ్జామ్ షెడ్యూల్ విడులైంది. టీఎస్ ఎంసెట్ 2023కు సంబంధించిన పరీక్షా తేదీలను (TS EAMCET 2023 Exam Dates) రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. మే 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్ష మే 7 నుంచి 11 వరకు జరగ్గా, మే 12 నుంచి 14వ తేదీరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు జరగనున్నాయి. టీఎస్ ఎంసెట్ 2023తో పాటు ఇతర ప్రవేశ పరీక్షలు అంటే ఎడ్‌సెట్, ఈసెట్, లాసెట్, పీజీ ఎల్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా తేదీలు కూడా విడుదలయ్యాయి.
తెలంగాణ ఎంసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (TS EAMCET Exam 2023 Important Dates)
తెలంగాన ఎంసెట్ 2023కు (TS EAMCET 2023) సంబంధిం ముక్యమైన తేదీలను ఈ దిగువున అందజేశాం. అభ్యర్థులు ఈ కింద టేబుల్లో పరీక్షా తేదీలను పరిశీలించ వచ్చు.ఈవెంట్ | ముఖ్యమైన తేదీలు |
---|---|
టీఎస్ ఎంసెట్ 2023 పరీక్ష తేదీలు (ఇంజనీరింగ్) |
మే 7వ తేదీ నుంచి మే 11, 2023
(ఆదివారం నుంచి గురువారం) |
టీఎస్ ఎంసెట్ 2023 పరీక్ష తేదీలు (అగ్రికల్చర్) |
మే 12 నుంచి మే 14, 2023
(శుక్రవారం నుంచి ఆదివారం) |
తెలంగాణ ఎంసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (Telangana EAMCET 2023 Important Dates)
టీఎస్ ఎంసెట్ 2023 పరీక్షలు మే ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. టీఎస్ ఎంసెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీల గురించి ఈ దిగువున అందించడం జరిగింది.
ఈవెంట్స్ | ముఖ్యమైన తేదీలు |
---|---|
టీఎస్ ఎంసెట్ 2023 దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 3, 2023 |
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు ఫార్మ్ సబ్మిషన్ చివరి తేదీ | ఏప్రిల్ 10, 2023 |
టీఎస్ ఎంసెట్ కరెక్షన్ విండో | ఏప్రిల్ 12 నుంచి 14 వరకు |
ఆలస్య రుసుము రూ.250లతో లాస్ట్ డేట్ సబ్మిషన్ తేదీ | ఏప్రిల్ 15, 2023 |
ఆలస్య రుసుము రూ.500లతో లాస్ట్ డేట్ సబ్మిషన్ తేదీ | ఏప్రిల్ 20, 2023 |
ఆలస్య రుసుము రూ.2500లతో సబ్మిషన్ లాస్ట్ డేట్ | ఏప్రిల్ 25, 2023 |
ఆలస్య రుసుము రూ.5000లతో సబ్మిషన్ లాస్ట్ డేట్ | మే 2, 2023 |
టీఎస్ ఎంసెట్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్ | ఏప్రిల్ 30, 2023 |
టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ డేట్ | ఇంజనీరింగ్ అభ్యర్థులకు మే 7 నుంచి 11, అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు మే 12 నుంచి 14 వరకు |
తెలంగాణ ఎంసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు (TS EAMCET 2023 Exam Important Highlights)
తెలంగాణ ఎంసెట్ 2023కు (TS EAMCET 2023) సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఈ దిగువున తెలియజేయడం జరిగింది.
- జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ ఎంసెట్ 2023 ఎగ్జామ్ జరుగుతుంది.
- అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైౌన్ మోడ్‌లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
- తెలంగాణ ఎంసెట్ 2023కు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులైతే రూ.1600లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.800లు చెల్లించాల్సి ఉంటుంది.
- టీఎస్ ఎంసెట్ 2023 ఎగ్జామ్ ఆన్‌లైన్ సీబీటీ మోడల్లో ఉంటుంది.
- టీఎస్ ఎంసెట్ 2023 ప్రశ్నాపత్రాలను ఇంగ్లీష్, తెలుగు, ఉర్ధూ భాషల్లో ఇస్తారు.
- ప్రతి సరైన సమాధానానికి ఒక్క మార్కును ఇవ్వడం జరుగుతుంది.
- అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షలో 180 నిమిషాల్లో 160 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ఆసక్తి గల అభ్యర్థులు (TS EAMCET 2023) దరఖాస్తు ఫార్మ్‌ను తెలంగాణ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche లో ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవాలి. TS EAMCET 2023 రిజిస్ట్రేషన్ తేదీ ఫిబ్రవరిలోనే ముగిసే అవకాశం ఉంది.
టీఎస్ ఎంసెట్‌కు 2023 ( TS EAMCET 2023)కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోంస College Dekho చూస్తూ ఉండండి.