టీఎస్ ఎంసెట్ 2023 అధికారిక వెబ్‌సైట్ ప్రారంభం; మార్చి 3 నుంచి రిజిస్ట్రేషన్

Andaluri Veni

Updated On: February 28, 2023 01:42 PM

TSCHE ఫిబ్రవరి 28న తెలంగాణ ఎంసెట్ 2023 వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అభ్యర్థుల కోసం తెలంగాణ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్‌ మార్చి 3వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. టీఎస్ ఎంసెట్‌ దరఖాస్తు విధానం గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు. 
  
ts eamcet 2023 official website launchedts eamcet 2023 official website launched

టీఎస్ ఎంసెట్ 2023 అధికారిక వెబ్‌సైట్  ప్రారంభం: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తెలంగాణ ఎంసెట్ 2023 అధికారిక వెబ్‌సైట్‌‌ని (h ttps://eamcet.tsche.ac.in) నేడు  (ఫిబ్రవరి 28, 2023) ప్రారంభించింది. తెలంగాణ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 3, 2023న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు కోసం అప్లికేషన్ ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌‌లో అందుబాటులో ఉంటుంది. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లేదా టీఎస్ ఎంసెట్ ప్రతి సంవత్సరం JNTU, హైదరాబాద్ ద్వారా నిర్వహించబడే రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరపున జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ టీఎస్ ఎంసెట్‌ 2023ని నిర్వహిస్తుంది.  ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్ 2023 పరీక్ష మే 7 నుంచి 11, 2023 వరకు (ఇంజనీరింగ్ పరీక్ష), మే 12 నుంచి 14, 2023 (వ్యవసాయం) వరకు జరగాల్సి ఉంది.

టీఎస్ ఎంసెట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీ, ప్రైవేట్ కాలేజీల్లో అందించే వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం కల్పించడం జరుగుతుంది. ఇంజనీరింగ్, మెడికల్. అగ్రికల్చర్ రంగంలోని UG కోర్సులలో అడ్మిషన్లు అందించబడుతుంది.

టీఎస్ ఎంసెట్ 2023 అప్లికేషన్ విధానం

  • టీఎస్ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ 3 మార్చి 2023 నుంచి ప్రారంభమవుతుంది
  • అభ్యర్థులు ఆన్‌లైన్‌ పద్ధతిలో అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలి
  • అభ్యర్థులు ముందుగా h ttps://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌‌ని సందర్శించాలి
  • ముందుగా అభ్యర్థులు TS EAMCET 2023 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.అభ్యర్థులు దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా, డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500; ఇతరులకు రూ.900గా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • పేమంట్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి దరఖాస్తును పూరించాలి.
  • అప్లికేషన్‌లో అభ్యర్థులు తమ పూర్తి వివరాలను అందించాలి.
  • అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో? లేదో? చెక్ చేసుకోవాలి
  • తర్వాత అభ్యర్థులు అప్లికేషన్‌లో స్కాన్ చేసిన ఫోటోలను అప్‌లోడ్ చేయాలి.
  • ఫిల్ చేసిన దరఖాస్తు ఫార్మ్‌ని, ఫీజు రసీదుని ప్రింట్ తీసుకుని భవిష్యత్తు సూచన కోసం సేవ్ చేసుకోవాలి.
  • అభ్యర్థి అర్హతలు సరిగ్గా లేకపోతే, ఏదైనా తప్పుడు లేదా తప్పు వివరాలు అందించబడితే లేదా చివరి తేదీ తర్వాత సబ్మిట్ చేస్తే దరఖాస్తు తిరస్కరించబడుతుంది.

టీఎస్ ఎంసెట్ 2023 పరీక్షా తేదీలు

టీఎస్ ఎంసెట్ 2023 పరీక్షలు మే ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. టీఎస్ ఎంసెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీల గురించి ఈ దిగువున అందించడం జరిగింది.
ఈవెంట్స్ ముఖ్యమైన తేదీలు
టీఎస్ ఎంసెట్ 2023 దరఖాస్తు ఫార్మ్ విడుదల ఫిబ్రవరి 28
టీఎస్ ఎంసెట్ 2023 దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి 3, 2023
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు ఫార్మ్ సబ్మిషన్ చివరి తేదీ ఏప్రిల్ 10, 2023
టీఎస్ ఎంసెట్ కరెక్షన్ విండో ఏప్రిల్ 12 నుంచి 14 వరకు
ఆలస్య రుసుము రూ.250లతో లాస్ట్ డేట్ సబ్మిషన్ తేదీ ఏప్రిల్ 15, 2023
ఆలస్య రుసుము రూ.500లతో లాస్ట్ డేట్ సబ్మిషన్ తేదీ ఏప్రిల్ 20, 2023
ఆలస్య రుసుము రూ.2500లతో సబ్మిషన్  లాస్ట్ డేట్ ఏప్రిల్ 25, 2023
ఆలస్య రుసుము రూ.5000లతో సబ్మిషన్  లాస్ట్ డేట్ మే 2, 2023
టీఎస్ ఎంసెట్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్ ఏప్రిల్ 30, 2023
టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ డేట్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు మే 7 నుంచి 11, అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు  మే 12 నుంచి 14 వరకు

టీఎస్ ఎంసెట్ 2023కు సంబంధించిన మరిన్ని వివరాలను  కాలేజ్ దేఖో‌ని ఫాలో అవుతూ ఉండండి

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-eamcet-2023-official-website-launched-37200/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

ఎగ్జామ్ అప్డేట్ మిస్ అవ్వకండి !!

Top