TS EAMCET 2024 పరీక్షా తేదీలు (TS EAMCET Exam Dates 2024) : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కారణంగా, TSCHE TS EAMCET 2024 పరీక్ష తేదీని (TS EAMCET Exam Dates 2024) వాయిదా వేసింది. నిర్ణయం తర్వాత, TS EAMCET 2024 ఇంజనీరింగ్ పరీక్ష మే 8, 9 తేదీల్లో జరుగుతుంది. అయితే అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 10, 11, 2024 తేదీల్లో నిర్వహించబడతాయి. అధికారిక వెబ్‌సైట్‌లో TS EAMCET 2024 అధికారిక పరీక్ష తేదీని అధికారులు ఇంకా అప్‌డేట్ చేయలేదు. వారు స్థానిక మీడియాకు తేదీలను మాత్రమే ధ్రువీకరించారు.
మరోవైపు TS EAMCET 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది త్వరలో ఏప్రిల్ 6, 2024న క్లోజ్ అవుతుంది. (ఆలస్య ఫీజు లేకుండా). ఆ తర్వాత, అభ్యర్థులు TS EAMCET దరఖాస్తు ఫార్మ్‌ను మే 4, 2024 వరకు (ఆలస్య రుసుముతో) పూరించడానికి అవకాశం ఉంది. నివేదిక ప్రకారం, మొత్తం 1.68 లక్షల మంది అభ్యర్థులు ఇప్పటికే TS EAMCET 2024 పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు.
TS EAMCET 2024 దరఖాస్తు ఫార్మ్: ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి (TS EAMCET 2024 Application Form: Apply Now)
TS EAMCET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను పూరించే ప్రక్రియ అప్లికేషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియతో ప్రారంభించబడింది. TS EAMCET 2024 పరీక్షకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు క్రింది డైరెక్ట్ లింక్ ద్వారా వెళ్లాలి:
TS EAMCET 2024 దరఖాస్తు ఫార్మ్: ముఖ్యమైన సూచనలు (TS EAMCET 2024 Application Form: Important Instructions)
అభ్యర్థులు TS EAMCET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను పూరించే ప్రక్రియకు సంబంధించిన కింది సూచనలను ఇక్కడ చూడవచ్చు:
- అభ్యర్థులు వారి వ్యక్తిగత ఈ మెయిల్ ID, క్రియాశీల మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి.
- అభ్యర్థులు అవసరమైన అన్ని విద్యా సర్టిఫికెట్‌లు/వివరాలను అవసరమైనప్పుడు తప్పనిసరిగా సూచించాలి.
- దానితో పాటు, అభ్యర్థులు వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం, కేటగిరీ సర్టిఫికెట్ (వర్తిస్తే) అప్‌లోడ్ చేయాలి.
- TS EAMCET దరఖాస్తు ఫీజు చెల్లింపు క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చేయాలి
- TS EAMCET దరఖాస్తు ఫీజు చెల్లించిన తర్వాత, మొత్తం తిరిగి చెల్లించబడదు.
- విజయవంతమైన రుసుము చెల్లింపు తర్వాత, చెల్లింపు ID జనరేట్ చేయబడుతుంది.
- అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లింపు రసీదు ప్రింటవుట్ తీసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి...
లింకులు |
---|
TS POLYCET 2024 వాయిదా వేయబడింది |
AP EAMCET 2024 వాయిదా పడింది |