టీఎస్ ఎంసెట్ 2023 ఎగ్జామ్ డేట్స్‌లో మార్పులు (TS EAMCET 2023 Exam Dates Changed):
తెలంగాణ ఎంసెట్ 2023 షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు (TS EAMCET 2023 Exam Dates Changed) చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. మే 7వ తేదీ నుంచి 11 వరకు నిర్వహించాల్సిన ఇంజనీరింగ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేశారు.
అయితే నీట్నీ, టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షల కారణంగా ఈ షెడ్యూల్లో (TS EAMCET 2023 Exam Dates Changed) మార్పులు చేసినట్టు సంబంధిత అధికారులు తెలియజేశారు.అయితే, మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను యథాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
టీఎస్ ఎంసెట్ 2023 ముఖ్యమైన తేదీలు ( TS EAMCET 2023 Important Dates)
తెలంగాణ ఎంసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. మార్పి ఎగ్జామ్ డేట్స్‌ను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
కార్యక్రమం | ముఖ్యమైన తేదీలు |
---|---|
టీఎస్ ఎంసెట్ 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | మార్చి 3, 2023 |
టీఎస్ ఎంసెట్ 2023 దరఖాస్తు పూరించడానికి లాస్ట్ డేట్ | ఏప్రిల్ 10, 2023 |
రూ.250ల ఆలస్య ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ | ఏప్రిల్ 15, 2023 |
రూ.500ల ఆలస్య ఫీజుతో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 20, 2023 |
రూ.2,500లతో లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 25, 2023 |
రూ.5000లతో లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | మే 2, 2023 |
అప్లికేషన్ కరెక్షన్ చేసుకునే ప్రక్రియ | ఏప్రిల్ 12 నుంచి 14, 2023 వరకు |
టీఎస్ ఎంసెట్ 2023 పరీక్షలు | ఇంజనీరింగ్ మే 12, 13, 14, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే, 10, 11 తేదల్లో |
తెలంగాణ ఎంసెట్ 2023 షెడ్యూల్లో జరిగిన మార్పులను విద్యార్థులు గమనించి దానికనుగుణంగా పరీక్షకు మరింత బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎంసెట్‌లో బాగా రాణించి మంచి ర్యాంకు సాధించాలని కోరుకునే విద్యార్థులు దానిక తగ్గట్టుగా స్టడీ ప్లాన్ చేసుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
తెలుగులో మరిన్ని వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసిన తెలుసుకోవచ్చు.