TS EAMCET క్వాలిఫైయింగ్ మార్కులు 2024 (TS EAMCET Qualifying Marks 2024) : తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ TS EAMCET 2024కి కనీస అర్హత మార్కులను నిర్దేశించింది. కనీస అర్హత మార్కులు (TS EAMCET Qualifying Marks 2024) సాధించిన అభ్యర్థులు మాత్రమే ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి TS EAMCET కౌన్సెలింగ్ 2024లో పాల్గొనడానికి అర్హులు. జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక అర్హత మార్కుల ప్రమాణాలు ఉన్నాయి. అభ్యర్థులు ఇక్కడ అర్హత మార్కుల వివరాలను తెలుసుకోవచ్చు.
TS EAMCET క్వాలిఫైయింగ్ (ఉత్తీర్ణత) మార్కులు 2024 (TS EAMCET Qualifying (Passing) Marks 2024)
TS EAMCET 2024 కోసం అర్హత (ఉత్తీర్ణత) మార్కులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి –కేటగిరి పేరు | పాస్ మార్కులు |
---|---|
OC | 160కి 40 (25% మార్కులు) |
BC | 160కి 40 (25% మార్కులు) |
SC/ ST | కనీస అర్హత మార్కులు అవసరం లేదు |
ఇది కూడా చదవండి |
లింకులు |
---|
TS EAMCET ఫలితాల లింక్ 2024 |
TS EAMCET కౌన్సెలింగ్ తేదీలు 2024 |
TS EAMCET ర్యాంక్ కార్డ్ 2024 |
TS EAMCET కౌన్సెలింగ్ 2024 కోసం, అన్ని వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ విధానాలు ఉన్నాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మొత్తం ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య రిజర్వేషన్ విధానాల ప్రకారం విభజించబడింది. బీసీ కేటగిరీని బీసీ-ఏ, బీసీ-బీ, బీసీ-సీ, బీసీ-డీ తదితర రకాలుగా విభజించారు.మరోవైపు మహిళా అభ్యర్థులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు. అభ్యర్థులకు వారి ర్యాంక్ మరియు రిజర్వేషన్ విధానాల ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి.
TSCHE TS EAMCET 2024ని మే 7, 8, 9, 10 మరియు 11 తేదీల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల కోసం నిర్వహించింది. ఈ సంవత్సరం దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు మరియు ఈ సంవత్సరం అడ్మిషన్ల కోసం పోటీ స్థాయి చాలా ఎక్కువగా ఉంది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే TS EAMCET 2024 కోసం దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది.