తెలంగాణ ఈసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల, దరఖాస్తు చేసుకునే విధానం ఇక్కడ తెలుసుకోండి
టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తు ఫార్మ్ విడుదల:
ఉస్మానియా విశ్వవిద్యాలయం టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తు ఫార్మ్ గురువారం ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల చేసింది. టీఎస్ ఈసెట్ దరఖాస్తు ఫార్మ్ అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.inలో అందుబాటులో ఉంది. అభ్యర్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా మే 5వ తేదీ నాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్ ఈసెట్‌కు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్, దరఖాస్తు రుసుము చెల్లింపు, TS ECET దరఖాస్తు ఫార్మ్ ఫిల్ చేయడం, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయడం, సబ్మిట్ చేయడం వంటి దశలు ఉంటాయి. దరఖాస్తు ఫార్మ్‌ని విజయవంతంగా ఫిల్ చేసిన అభ్యర్థులు షెడ్యూల్ చేసిన తేదీలో తెలంగాణ ఈసెట్ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టీఎస్ ఈసెట్ 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు కొన్ని అర్హతలు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫార్మసీ, ఇంజనీరింగ్, టెక్నాలజీలో డిప్లొమా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ సంవత్సరం TS ECET 2023 పరీక్షను మే 20, 2023న నిర్వహించనున్నారు.
టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన తేదీలు ఈ దిగువున అందజేయడం జరిగింది.
ఈవెంట్స్ | ముఖ్యమైన తేదీలు |
---|---|
టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం | మార్చి 3, 2023 |
ఆలస్య రుసుము లేకుండా టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తుకు చివరి తేదీ | మే 5, 2023 |
లేట్ ఫీజు రూ.500లతోొ దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ | మే 8, 2023 |
కరెక్షన్ విండో | మే 8 నుంచి 12 వరకు |
ఆలస్య రుసుము రూ.2500లతో లాస్ట్ డేట్ | మే 12, 2023 |
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే తేదీ | మే 15, 2023 |
టీఎస్ ఈసెట్ 2023 పరీక్షా తేదీ | మే 20, 2023 |
టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన సూచనలు
టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తు ఫార్మ్‌ని ఫిల్ చేసేటప్పుడు అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన అంశాలను అనుసరించాలి. దరఖాస్తు చేసుకునే విధానం గురించి ఈ దిగువున వివరంగా తెలియజేయడం జరిగింది.- దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.inలోకి వెళ్లాలి.
- అభ్యర్థులు ముందుగా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- దరఖాస్తు ఫీజు చెల్లించిన తర్వాత అభ్యర్థులు “చెల్లింపు ధ్రువీకరణ” ఎంపికపై క్లిక్ చేయాలి. తప్పనిసరి ఫీల్డ్‌లను పూరించాలి
- జనరల్ కేటగిరీ అభ్యర్థులకు TS ECET దరఖాస్తు రుసుము వరుసగా రూ. 800, SC/ST అభ్యర్థులకు రూ. 400లు
- టీఎస్ ఈసెట్ దరఖాస్తు ఫార్మ్‌ని సబ్మిట్ చేసే ముందు, అభ్యర్థులు ఫ్రీజ్‌ను ఎంచుకోవాలి/ సబ్మిట్ చేసి నిర్ధారించాలి
- అభ్యర్థులు భవిష్యత్ సూచన కోసం TS ECET దరఖాస్తు ఫార్మ్ ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్‌కు సంబంధించిన మరిన్ని విద్యా వార్తల కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.comలో కూడా మాకు రాయవచ్చు.