TS ECET Hall Ticket 2024 Download Link Activated
TS ECET హాల్ టికెట్ 2024 (TS ECET Hall Ticket 2024 Link) :
మే 6, 2024న నిర్వహించాల్సిన పరీక్ష కోసం TSCHE ఈరోజు మే 1, 2024న హాల్ టికెట్లను విడుదల చేసింది. TS ECET హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ లింక్ (TS ECET Hall Ticket 2024 Link) దిగువన జోడిచండం జరిగింది. అభ్యర్థులు TS ECET హాల్ టికెట్ 2024ను ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.ఎందుకంటే ఆఫ్‌లైన్ మోడ్‌లు అందుబాటులో ఉండవు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ ఈరోజు, మే 1, 2024న యాక్టివేట్ చేయబడింది. కాబట్టి రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను చెక్ చేసి, పరీక్ష రోజు కోసం ముందుగానే ప్రింట్ చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌లో అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, పరీక్ష దిన మార్గదర్శకాలతో పాటు పరీక్షా వేదిక చిరునామా, రిపోర్టింగ్ సమయం వంటి పరీక్షా రోజుకి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఉంటాయి.
ఇది కూడా చెక్ చేయండి | TS ECET హాల్ టికెట్ అంచనా విడుదల సమయం 2024
ఇది కూడా చెక్ చేయండి | TS ECET హాల్ టికెట్ అంచనా విడుదల సమయం 2024
TS ECET హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ లింక్ (TS ECET Hall Ticket 2024 Download Link)
తెలంగాణ ఈసెట్ హాల్ టికెట్లు 2024 రిలీజ్ అయ్యాయి. హాల్ టికెట్ల లింక్ సంబంధిత వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ లింక్ యాక్టివేట్ అయింది. ఆ లింక్‌ని ఈ దిగువున టేబుల్లో అందించాం. ఈ హాల్ టికెట్లు పరీక్ష ప్రారంభమయ్యే వరకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిషన్ల సమయంలో అవసరమైనందున భద్రంగా ఉంచడానికి హాల్ టికెట్ రెండు కాపీలను ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలి.TS ECET హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ లింక్ ఇక్కడ ఉంది- ఇక్కడ క్లిక్ చేయండి |
---|
TS ECET పరీక్ష రోజు సూచనలు 2024
TS ECET హాల్ టికెట్ 2024 ఇప్పుడు విడుదల చేయబడినందున, పరీక్షలకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పరీక్ష రోజు, పరీక్షల ముందు, సమయంలో అనుసరించాల్సిన కింది సూచనలను గమనించాలి:- ఆలస్యంగా వెళ్లిన వారు పరీక్షలకు హాజరు కావడానికి అనుమతించబడరు, కాబట్టి, రిపోర్టింగ్ సమయానికి 30 నిమిషాల ముందు పరీక్ష హాల్‌కు చేరుకోవడం ఉత్తమం.
- పరీక్ష హాల్ ప్రవేశద్వారం వద్ద అభ్యర్థుల ధ్రువీకరణ జరుగుతుంది, కాబట్టి అభ్యర్థులు వారి TS ECET హాల్ టికెట్ 2024, ఫోటో ID రుజువును తీసుకువెళ్లాలి.
- పరీక్ష హాలులోకి ప్రవేశించిన తర్వాత, పరీక్ష సమయం ముగిసిన తర్వాత మాత్రమే అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతించబడతారు.
- పరీక్ష జరుగుతున్నప్పుడు అభ్యర్థులు ఇన్విజిలేటర్ సూచనలకు కట్టుబడి ఉండాలి.
- ఎవరైనా అభ్యర్థులు చీటింగ్‌కు ప్రయత్నించినట్లు తేలితే, వారు పరీక్ష హాలు నుండి ఒకేసారి తొలగించబడతారు మరియు పరీక్షను కొనసాగించడానికి అనుమతించబడరు.