TS ECET Seat Allotment Date 2023: మొదటి దశ తెలంగాణ ఈసెట్ సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Andaluri Veni

Updated On: August 04, 2023 09:48 AM

TS ECET మొదటి దశ సీట్ల కేటాయింపు  ఫలితాలు 2023  (TS ECET Seat Allotment Date 2023)  ఆగస్ట్ 8 2023న లేదా అంతకు ముందు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడుతుంది. సీటు పొందిన అభ్యర్థులు ఆగస్టు 12, 2023లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. 
TS ECET Seat Allotment Date 2023TS ECET Seat Allotment Date 2023

TS ECET సీట్ల కేటాయింపు తేదీ 2023 (TS ECET Seat Allotment Date 2023): తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ TS ECET మొదటి దశ సీట్ల కేటాయింపు ఫలితాలను ఆగస్టు 8, 2023న లేదా అంతకు ముందు విడుదలయ్యే అవకాశం ఉంది. మొదటి దశ కోసం TS ECET సీట్ల కేటాయింపు ఫలితాన్ని  (TS ECET Seat Allotment Date 2023)   సాయంత్రం 6 గంటలలోపు విడుదల చేసే ఛాన్స్ ఉంది. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను చెక్ చేయడానికి, డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, అభ్యర్థి లాగిన్‌లో ROC ఫార్మ్ నెంబర్, TS ECET హాల్ టికెట్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి.

అభ్యర్థులు మొదటి దశ TS ECET సీట్ల కేటాయింపుతో సంతృప్తి చెందితే లేదా వారి ప్రాధాన్యతల ప్రకారం సీటు కేటాయించబడితే, వారు ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఆగస్టు 12వ తేదీలోపు కేటాయించిన సీటును అంగీకరించాలి. అధికారిక ప్రకటన ప్రకారం, అభ్యర్థులు ట్యూషన్ ఫీజుగా రూ. 10000 (SC/ST కోసం, మొత్తం రూ. 5000) చెల్లించాలి.

గమనిక: అభ్యర్థులు చివరి దశ తర్వాత కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేస్తే ఆ మొత్తం అభ్యర్థులకు తిరిగి ఇవ్వబడుతుంది. అలాగే, అభ్యర్థులు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయకపోతే, ట్యూషన్ ఫీజు ఆటోమేటిక్‌గా జప్తు చేయబడుతుంది.

TS ECET సీట్ల కేటాయింపు 2023: ముఖ్యమైన తేదీలు (TS ECET Seat Allotment 2023: Important Dates)

అభ్యర్థులు TS ECET 2023 మొదటి దశ సీట్ల కేటాయింపులో ముఖ్యమైన తేదీలని ఈ కింది టేబుల్లో ఇక్కడ చూడవచ్చు:

ఈవెంట్స్

తేదీలు

మొదటి దశ సీట్ల కేటాయింపు విడుదల

ఆగష్టు 8, 2023న లేదా నాటికి

కేటాయించిన కళాశాలలకు ట్యూషన్ ఫీజు చెల్లించడం, స్వీయ రిపోర్టింగ్

ఆగస్టు 8 నుంచి 12, 2023 వరకు

మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి TS ECET చివరి దశ కౌన్సెలింగ్ ఆగస్టు 20, 2023న ప్రారంభించబడుతుంది. అభ్యర్థులు షెడ్యూల్ చేసిన తేదీ లోపు ట్యూషన్ ఫీజు చెల్లించకపోతే ప్రొవిజనల్ అలాట్‌మెంట్ రద్దు చేయబడుతుంది. మరోవైపు, అభ్యర్థులకు వారి ప్రాధాన్యతలు కాకుండా ఇతర సీట్లు ఉంటే, సీట్ల అప్‌గ్రేడ్ కోసం సీట్ల కేటాయింపు రౌండ్ యొక్క చివరి దశ వరకు వేచి ఉండాలి.

ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-ecet-seat-allotment-date-2023-know-when-first-phase-allotment-is-released-43748/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Tell us your TS ECET score & access the list of colleges you may qualify for!

కాలేజ్ ను ప్రెడిక్ట్ చేయండి
Top