తెలంగాణ ఎడ్‌సెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు 2024 (TS EDCET First Phase Seat Allotment Result 2024) : తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) TS EDCET 2024 ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ 2024 ఫలితాలను ఆగస్టు 30, 2024న విడుదలవ్వాల్సి ఉంది. కానీ ఆలస్యమై ఆగస్టు 31న విడుదలైంది. అభ్యర్థులు తమ సీట్ల కేటాయింపు స్థితిని చెక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అధికారిక వెబ్‌సైట్ edcetadm.tsche.ac.in సందర్శించవచ్చు. సీట్ అలాట్‌మెంట్ జాబితాను యాక్సెస్ చేయడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా వారి TS EDCET హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, ర్యాంక్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
అభ్యర్థులు సబ్మిట్ చేసిన ప్రాధాన్యతలు, TS EDCETలో వారి ర్యాంకులు, ఆయా కళాశాలల్లో సీట్ల లభ్యతతో సహా అనేక అంశాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు కేటాయించిన తర్వాత, అభ్యర్థులు అవసరమైన అడ్మిషన్ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి ఆగస్టు 31, సెప్టెంబర్ 4, 2024 మధ్య తమకు కేటాయించిన కాలేజీలకు రిపోర్ట్ చేయాలి.
TS EDCET మొదటి దశ సీట్ల కేటాయింపు ఫలితం 2024 డౌన్‌లోడ్ లింక్ (TS EDCET First Phase Seat Allotment Result 2024 Download Link)
TS EDCET 2024 సీట్ల కేటాయింపులో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితా విడుదలైంది. మేము అదే లింక్‌ను ఈ దిగువ టేబుల్లో ఇక్కడ భాగస్వామ్యం చేశాం. అభ్యర్థులు తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేయడానికి వారి అప్లికేషన్ ID, పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి.
TS EDCET మొదటి దశ సీట్ల కేటాయింపు ఫలితం 2024 లింక్ |
---|
TS EDCET ఫస్ట్ ఫేజ్ కాలేజ్ వారీగా సీటు అలాట్‌మెంట్ 2024 లింక్ |
TS EDCET మొదటి దశ సీట్ల కేటాయింపు ఫలితం 2024: రిజర్వేషన్ విధానం
TS EDCET సీట్ల కేటాయింపు SC, ST, OBC, PwD మొదలైన వివిధ కేటగిరీల ఆధారంగా అడ్మిషన్‌ను అందిస్తుంది. దరఖాస్తుదారులు TS EDCET సీట్ల కేటాయింపు 2024 కోసం రిజర్వేషన్ విధానాన్ని ఈ దిగువన చెక్ చేయాలి.
కేటగిరి | రిజర్వ్ చేయబడిన సీట్లు |
---|---|
లొకల్ అభ్యర్థులు | 85% |
రిజర్వ్ చేయబడలేదు | 15% |
SC | 15% |
ST | 10% |
BCA | 7% |
BCB | 10% |
BCD | 7% |
BCC | 1% |
EWS | 10% |
BC | 4% |
PwD | 3% |
అలాట్‌మెంట్ జాబితా కళాశాలల వారీగా వివరాలను అందజేస్తుంది, అభ్యర్థులు తమకు ఏ కళాశాల కేటాయించబడిందో నిర్ణయించడంలో సహాయపడుతుంది. అలాట్‌మెంట్ ఫలితం పబ్లిష్ చేయబడిన తర్వాత అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాల, కోర్సును జాగ్రత్తగా సమీక్షించుకోవాలి. అలాట్‌మెంట్‌తో సంతృప్తి చెందినట్లయితే, వారు తప్పనిసరిగా ప్రొవిజనల్ అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసి, అడ్మిషన్ ప్రక్రియలో తదుపరి దశలకు వెళ్లాలి.