టీఎస్ ఐసెట్ 2023 నోటిఫికేషన్ రిలీజ్, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
టీఎస్ ఐసెట్ 2023 నోటిఫికేషన్ విడుదల:
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆలస్య రుసుము లేకుండా మార్చి 6వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్ష మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో జరుగుతుంది. విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను మే 22వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టీఎస్ ఐసెట్ 2023 ముఖ్యమైన తేదీలు
టీఎస్ ఐసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువ పట్టికలో ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ వివరాలు తెలుసుకోవచ్చు.టీఎస్ ఐసెట్ 2023 ఈవెంట్ | ముఖ్యమైన తేదీలు |
---|---|
టీఎస్ ఐసెట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం | మార్చి 6 |
ఆలస్య రుసుము లేకుండా ఐసెట్ 2023 అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | మే 6, 2023 |
ఆలస్య రుసుము రూ.250తో ఐసెట్ 2023 అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | మే 12, 2023 |
ఆలస్య రుసుము రూ.500లతో ఐసెట్ 2023 అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | మే 18, 2023 |
టీఎస్ ఐసెట్ 2023 కరెక్షన్ విండో | మే 12 నుంచి మే 15 వరకు |
హాల్ టికెట్ల విడుదల | మే 22, 2023 |
టీఎస్ ఐసెట్ 2023 ఎగ్జామ్ డేట్స్ | మే 26, 27 2023 |
టీఎస్ ఐసెట్ 2023 ప్రవేశ పరీక్ష విధానం
- టీఎస్ ఐసెట్ ప్రవేశపరీక్షను మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో జరుగుతుంది.
- 26న మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2. 30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
- మూడో సెషన్ మే 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, నాలుగో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.
- పరీక్ష అనంతరం మొదటి ఆన్సర్ కీని జూన్ ఐదో తేదీన విడుదల చేయడం జరుగుతుంది.
- ప్రాథమిక కీపైన అభ్యంతరాలు ఉంటే జూన్ 8వ తేదీ వరకు తెలియజేయాల్సింటుంది.
- ఫైనల్ ఫలితాలు జూన్ 20న విడుదల చేయడం జరుగుతుంది.
ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.550లు చెల్లించాలి. జనరల్ అభ్యర్థులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. రూ.250 అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.500తో మే 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్ ఐసెట్ 2023కు విజయవంతంగా అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను మే 22 నుంచి సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.