TS ICET Counselling 2023: తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ 2023 వాయిదా, కొత్త షెడ్యూల్ ఇదే

Andaluri Veni

Updated On: August 14, 2023 10:03 am IST

ఆగస్టు 14న ప్రారంభం కావాల్సిన TS ICET కౌన్సెలింగ్ 2023 (TS ICET Counselling 2023)  వాయిదా పడింది. TSCHE కొత్త షెడ్యూల్‌ని విడుదల చేసింది. TS ICET 2023 కౌన్సెలింగ్  కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 6న ప్రారంభమవుతుంది.
TS ICET Counselling 2023 PostponedTS ICET Counselling 2023 Postponed

టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ వాయిదా (TS ICET Counselling 2023): TS ICET కౌన్సెలింగ్  2023 (TS ICET Counselling 2023) వాయిదా పడింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కొత్త షెడ్యూల్‌ని విడుదల చేసింది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం  కౌన్సెలింగ్‌ ఆగస్టు 14న ప్రారంభం కావాలి. కొన్ని కారణాల రీత్యా షెడ్యూల్ మారింది. కొత్త షెడ్యూల్ ప్రకారం TS ICET కౌన్సెలింగ్ 2023 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో సెప్టెంబర్ 6న ప్రారంభమవుతుంది.  మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 17న విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు రివైజ్డ్ TS ICET కౌన్సెలింగ్ 2023 షెడ్యూల్ ఇక్కడ ఉంది.

TS ICET రివైజ్డ్ కౌన్సెలింగ్ తేదీలు 2023 (TS ICET Revised Counseling Dates 2023)

టీఎస్ ఐసెట్ 2023కు సంబంధించిన కొత్త షెడ్యూల్  ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది.
ఈవెంట్ తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం సెప్టెంబర్ 6, 2023
డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ 8 నుంచి 12, 2023 వరకు
వెబ్ ఆప్షన్లు సెప్టెంబర్ 8 నుంచి 13, 2023 వరకు
సీటు కేటాయింపు సెప్టెంబర్ 17, 2023
చివరి దశ కౌన్సెలింగ్ ప్రారంభం తేదీ సెప్టెంబర్ 22, 2023
చివరి దశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 28, 2023

అలాగే అధికారిక TS ICET కౌన్సెలింగ్ 2023 వెబ్‌సైట్ tsicet.nic.in ప్రారంభించబడింది. ఆ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు మునుపటి సంవత్సరం కటాఫ్‌ని చెక్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం, TSCHE రెండు రౌండ్ల TS ICET కౌన్సెలింగ్ 2023ని నిర్వహిస్తోంది. ఆ తర్వాత స్పాట్ రౌండ్‌ను నిర్వహిస్తోంది. TS ICET ర్యాంక్ ఆధారంగా సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లు స్పాట్ రౌండ్ కౌన్సెలింగ్‌ని నిర్వహిస్తాయి. MBA, MCA విద్యార్థులకు మొదటి సంవత్సరం తరగతులు అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.

టీఎస్ ఐసెట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ ఏడాది కౌన్సెలింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనివార్య కారణాల వల్ల కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. సెప్టెంబర్‌లో కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు అభ్యర్థులు వేచి ఉండాలి. ఈలోపు తమకొచ్చిన ర్యాంకులకు ఏ సంస్థలో సీటు వస్తుందో.. గత ఏడాది ట్రెండ్‌ల ‌  ఆధారంగా అంచనా వేసుకోవచ్చు.

లేటెస్ట్ Education News , కాలేజీ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ఐడి news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

TS ICET Previous Year Question Paper

TS ICET 2020 30 Sep Shift 1 Question Paper

TS ICET 2020 30 Sep Shift 2 Question Paper

TS ICET 2020 30 Sep Shift 2 Urdu Question Paper

TS ICET 2020 1 Oct Shift 1 Question Paper

/news/ts-icet-counselling-2023-postponed-new-dates-released-44053/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!