తెలంగాణ ఐసెట్ ఫలితాల తేదీ 2024 (TS ICET Results Date 2024) : TSCHE తరపున కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, TS ICET ఫలితాలను 2024 జూన్ 28, 2024న (TS ICET Results Date 2024) విడుదల చేస్తుంది. ఫలితాలతో పాటు, అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంక్ కార్డ్ కూడా జారీ చేయబడుతుంది. TS ICET ఫలితాన్ని చెక్ చేయడానికి, అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్, పుట్టిన తేదీ వంటి వారి లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి. పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందిన వారు మాత్రమే TS ICET కౌన్సెలింగ్ ప్రక్రియ 2024లో పాల్గొనడానికి అర్హులు.
TS ICET ఫలితాలు తేదీ 2024 (TS ICET Results Date 2024)
జూన్ 6న రెండు ప్రవేశ పరీక్షలు ముగిసిన తర్వాత, విశ్వవిద్యాలయం ప్రతిస్పందనలను పరిశీలిస్తుంది. జూన్ 19 వరకు TS ICET ఆన్సర్ కీ 2024పై సమర్పించిన అభ్యంతరాలను కూడా ధ్రువీకరిస్తుంది. ఫలితాల ప్రకటన అధికారిక తేదీని దిగువన ఇక్కడ చెక్ చేయండి.TS ICET ఈవెంట్స్ | తేదీలు |
---|---|
ఎగ్జామ్ డేట్స్ | జూన్ 5, 6, 2024 |
తెలంగాణ ఐసెట్ ఫలితాలు 2024 | జూన్ 28, 2024 (షెడ్యూల్డ్) |
ఫలితాలను చెక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ | icet.tsche.ac.in |
ఈ ఏడాది TS ICET షెడ్యూల్‌లో జాప్యం జరగదు. కాకతీయ విశ్వవిద్యాలయం TS ICET పరీక్షా ప్రక్రియను టైంటేబుల్ ప్రకారం వేగంగా నిర్వహించగలిగింది మరియు అదే వేగాన్ని కూడా కొనసాగించాలని భావిస్తున్నారు.
ఫలితాల్లో అర్హత సాధించిన లేదా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు తమ TS ICET స్కోర్‌కార్డ్‌లు 2024 అందుబాటులో ఉన్న వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫలితాల తర్వాత TSCHE TS ICET కౌన్సెలింగ్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరలో ప్రకటిస్తుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులందరూ కోర్సు మరియు కళాశాల కోసం తమ ప్రాధాన్యతలను సమర్పించడం జరుగుతుంది. కాలేజీల మెరిట్, సీట్ మ్యాట్రిక్స్ ఆధారంగా మండలి సీట్లు కేటాయిస్తుంది.