తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2024 తేదీ (TS Inter Results 2024 Date) :
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు (TS Inter Results 2024 Date) ఏప్రిల్ 24వ తేదీన విడుదలకానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి వెల్లడించనున్నారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు (TSBIE) 2024 ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలని ఏప్రిల్ 24న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 ప్రకటన కోసం బోర్డు అధికారులు కచ్చితమైన తేదీ, సమయాన్ని ఇంకా నిర్ధారించ లేదు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2024 అధికారిక విలేకరుల సమావేశంలో ప్రకటించడం జరుగుతుంది. అనంతరం విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి. తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా తెలంగాణ ఇంటర్ ఫలితాల 2024 మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బోర్డు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 18 వరకు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను నిర్వహించింది. తెలంగాణ ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29వ నుంచి మార్చి 19 వరకు జరిగాయి. విద్యార్థులు TSBIE ఇంటర్మీడియట్ ఫలితం 2024ని
tsbie.cgg.gov.in
లో చెక్ చేయవచ్చు.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను 2024 ఎలా చెక్ చేయాలి? (How to check TS Intermediate Results 2024)
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు వారి తెలంగాణ ఇంటర్ ఫలితాలను 2024 చెక్ చేసుకునే విధానం ఈ దిగువున అందించాం.- ముందుగా అభ్యర్థులు తెలంగాణ ఇంటర్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inకి వెళ్లాలి.
- హోంపేజీలో సంబంధిత తెలంగాణ ఇంటర్ ఫలితాల లింక్‌ను గుర్తించి.. దానిపై క్లిక్ చేయాలి.
- ముందుగా సంవత్సరాన్ని ఎంచుకుని, మీ హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయాలి.
- స్క్రీన్‌పై మీ ఇంటర్మీడియట్ మార్కులు కనిపిస్తాయి.
- రికార్డు కోసం మార్కుల మెమోని డౌన్‌లోడ్ చేసుకుని దగ్గరే పెట్టుకోవాలి.
తెలంగాణ ఇంటర్ మార్క్‌షీట్‌లో ఉండే వివరాలు (Details On TS Inter Marksheet)
తెలంగాణ ఇంటర్మీడియట్ మార్క్ షీట్‌లో ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.- విద్యార్థి పేరు
- పుట్టిన తేదీ
- హాల్ టికెట్ నెంబర్
- ప్రతి సబ్జెక్టులో సాధించిన మార్కులు
- మొత్తం మార్కులు
- అర్హత స్థితి