TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ రేపు, 2 మార్చి 2023, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ద్వారా విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్రం నుండి LAWCET చదవాలి అనుకున్న అభ్యర్థులు 6 ఏప్రిల్ 2023 వరకు ఫారమ్‌ను పూరించగలరు. TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ అధికారిక వెబ్‌సైట్ lawcet.tsche.ac.in లో అందుబాటులో ఉంచబడుతుంది. TS LAWCET 2023 రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ ఏప్రిల్ 6, 2023. విద్యార్థులు 3 సంవత్సరాల LLB లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ LLB కోర్సు ని ఎంచుకోవచ్చు. పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు స్వయంగా నమోదు చేసుకోవాలి మరియు దరఖాస్తు రుసుము చెల్లించాలి.TS LAWCET 2023 పరీక్ష 25 మే 2023న నిర్వహించబడుతుంది. TS LAWCET 2023 గురించి మరింత తెలుసుకోవడానికి ఆర్టికల్ పూర్తిగా చదవండి.
TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ తేదీలు
TS LAWCET 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.ఈవెంట్స్ | తేదీలు |
---|---|
TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల | 2 మార్చి 2023 |
TS LAWCET 2023 దరఖాస్తు ప్రక్రియ ముగింపు | 6 ఏప్రిల్ 2023 |
TS LAWCET 2023 పరీక్ష తేదీ | 25 మే 2023 |
TS LAWCET 2023 దరఖాస్తు ప్రక్రియ
TS LAWCET 2023 కోసం దరఖాస్తు ప్రక్రియ క్రింది విధంగా ఉంటుంది.- రిజిస్ట్రేషన్
- అప్లికేషన్ ఫార్మ్ పూరించడం
- ఫీజు చెల్లింపు
TS LAWCET 2023 దరఖాస్తు రుసుము
అభ్యర్థులు కేటగిరీ వారీగా మరియు కోర్సు వారీగా TS LAWCET 2023 అప్లికేషన్ ఫీజులను ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.స్ట్రీమ్/కోర్సు | కేటగిరీ | రుసుము (రూ.) |
---|---|---|
TS లాసెట్
(LL.B.3 /5 సంవత్సరాలు) | జనరల్ | 900 |
రిజర్వ్ కేటగిరీ | 600 | |
TS PGLCET
(LL. M.) | జనరల్ | 1100 |
రిజర్వ్ కేటగిరీ | 900 |