TS LAWCET 2023 Final Answer Key Date: జూన్ 20లోపు TS LAWCET 2023 ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు విడుదలయ్యే అవకాశం

Andaluri Veni

Updated On: June 06, 2023 05:44 pm IST

TSCHE అనుసరించే ట్రెండ్‌ల ప్రకారం TS LAWCET 2023 ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు (TS LAWCET 2023 Final Answer Key Date) జూన్ 20, 2023లోపు విడుదలయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను, మునుపటి సంవత్సరాల ట్రెండ్‌లు ఇక్కడ అందజేశాం. 
TS LAWCET 2023 Final Answer Key and Result DateTS LAWCET 2023 Final Answer Key and Result Date

TS LAWCET ఫలితం తేదీ 2023 (TS LAWCET 2023 Final Answer Key Date): TSCHE తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం TS LAWCET 2023, TS PGLCET 2023 పరీక్షలను మే 25, 2023న నిర్వహించింది. దానికి సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలను మే 29, 2023న విడుదల చేశారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలను మే 31, 2023 వరకు స్వీకరించారు. అభ్యంతరాల వరకు షెడ్యూల్ ముందుగా ప్రకటించినప్పటికీ ఫైనల్ ఆన్సర్ కీలను విడుదల తేదీ త్వరలో తెలియజేయబడుతుందని పేర్కోవడం జరిగింది. TS LAWCET ఫలితాల తేదీకి సంబంధించిన గత సంవత్సరాల ట్రెండ్‌లను అనుసరించినట్లయితే TS LAWCET 2023 ఫలితం (TS LAWCET 2023 Final Answer Key Date) జూన్ 15 నుంచి జూన్ 20 మధ్య అంటే అభ్యంతరాల సమర్పణ ముగిసిన తర్వాత 15 నుంచి 20 రోజుల వ్యవధి తర్వాత ప్రకటించబడుతుందని అందరూ భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి |

టీఎస్‌ లాసెట్ ఆన్సర్ కీ 2023
టీఎస్‌ లాసెట్ రెస్పాన్స్ షీట్ 2023

TS LAWCET 2023 ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాల తేదీ (TS LAWCET 2023 Final Answer Key and Result Date)

TS LAWCET 2023,  PGLCET పరీక్షలకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు అదే తేదీ, సమయానికి ప్రకటించబడతాయి. దానికి సంబంధించిన అంచనా షెడ్యూల్ ఈ కింది విధంగా ఉంటుంది:

ఈవెంట్ వివరాలు
ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితం విడుదల తేదీ (అంచనా) జూన్ 15 నుంచి 20, 2023
అభ్యంతర గడువు, ఫైనల్ కీ/ఫలితం మధ్య ఆశించిన గ్యాప్ పీరియడ్ తేదీ 15 నుంచి 20 రోజులు

TS LAWCET 2023 ఫలితం తేదీ : మునుపటి ట్రెండ్‌లు (TS LAWCET 2023 Result Date: Previous Trends)

ఈ దిగువ పట్టికలో ఉన్న డేటా ఆధారంగా చూస్తే TS LAWCET ఫలితం, ఫైనల్ ఆన్సర్ కీ ఎక్కువగా 17 నుంచి 20 రోజుల వ్యవధి తర్వాత విడుదల చేయబడతాయి. ఈ సంవత్సరం కూడా అదే షెడ్యూల్‌ను అనుసరించే అవకాశం ఉంది.

సంవత్సరం అభ్యంతరాల సమర్పణ గడువు ఫైనల్ కీ, ఫలితం తేదీ గ్యాప్
2022 జూలై 28, 2022 ఆగస్టు 17, 2022 20 రోజులు
2021 ఆగస్టు 28, 2021 సెప్టెంబర్ 15, 2021 18 రోజులు
2020 అక్టోబర్ 12, 2020 నవంబర్ 6, 2020 25 రోజులు
2019 మే 25, 2019 జూన్ 2, 2019 8 రోజులు
2018 మే 29, 2018 జూన్ 15, 2018 17 రోజులు

ఎంట్రన్స్ పరీక్షలు, బోర్డులు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-lawcet-2023-final-answer-key-and-result-expected-by-june-20-41518/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!