TS LAWCET Hall Ticket 2023: TS LAWCET హాల్ టికెట్లు 2023 విడుదల, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇదే లింక్

Andaluri Veni

Updated On: May 16, 2023 02:08 pm IST

TS LAWCET హాల్ టికెట్లు 2023 అధికారిక వెబ్‌సైట్ lawcet.tsche.ac.inలో విడుదలయ్యాయి. పరీక్ష రాసే అభ్యర్థులు ఈ దిగువున అందించిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా హాల్ టికెట్‌ను (TS LAWCET Hall Ticket 2023)  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
TS LAWCET Hall Ticket 2023 (Out Today)TS LAWCET Hall Ticket 2023 (Out Today)

TS LAWCET హాల్ టికెట్ 2023 (TS LAWCET Hall Ticket 2023): ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ ఈరోజు TS LAWCET హాల్ టికెట్ 2023ని  (TS LAWCET Hall Ticket 2023) విడుదల చేసింది. దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ lawcet.tsche.ac.in ద్వారా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS LAWCET 2023 పరీక్ష మే 25, 2023న మూడు సెషన్‌లలో నిర్వహించబడుతుంది. కాబట్టి అభ్యర్థులు చివరి నిమిషంలో గందగోళాన్ని  నివారించడానికి ముందుగా హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్  తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పత్రం. TS LAWCET హాల్ టికెట్ 2023 లేని పరీక్షకులు పరీక్షకు హాజరు కావడానికి అనుమతించబడరు. హాల్ టికెట్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువున ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి-

TS LAWCET Hall Ticket 2023 Direct link

TS LAWCET హాల్ టికెట్ 2023 తేదీ (TS LAWCET Hall Ticket 2023 Date)

దరఖాస్తుదారులు TS LAWCET హాల్ టికెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువ టేబుల్లో  తెలుసుకోవచ్చు.

ఈవెంట్స్

తేదీలు

TS LAWCET హాల్ టికెట్ 2023 విడుదల తేదీ

మే 16, 2023 (విడుదల చేయబడింది)

TS LAWCET పరీక్ష తేదీ 2023

మే 25, 2023

TS LAWCET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి స్టెప్స్ (Steps to Download TS LAWCET Hall Ticket 2023)

హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వొచ్చు.

స్టెప్ 1: TS LAWCET అధికారిక పోర్టల్‌ని బ్రౌజ్ చేయండి లేదా పైన ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో  'Download TS LAWCET Hall Ticket 20232' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: లాగిన్ చేయడానికి మీ రిజిస్ట్రేషన్ నెంబర్,  పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్‌ను ఉపయోగించండి.

స్టెప్ 4: మీరు లాగిన్ అయిన తర్వాత, హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

స్టెప్ 5: TS LAWCET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోండి. తదుపరి ఉపయోగం కోసం దాన్ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి.

గమనిక: అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌లో వారి పేరు, హాల్ టికెట్ నెంబర్ , రిజిస్ట్రేషన్ నెంబర్, సంతకం, ఫోటోగ్రాఫ్, తేదీ, పరీక్ష సమయం మొదలైన కొన్ని అవసరమైన వివరాలను చెక్ చేసుకోవాలి. హాల్ టికెట్‌లో ఏదైనా వ్యత్యాసం ఉంటే  విద్యార్థులు వెంటనే అధికారులను సంప్రదించాలి.

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-lawcet-hall-ticket-2023-released-link-activated-at-lawcet-tsche-ac-in-40427/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!