TS POLYCET ఫలితాలు విడుద తేదీ (TS POLYCET 2023 Result Date):
TS పాలిసెట్ 2023 పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, హైదరాబాద్ మే 17, 2023న నిర్వహించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను విడుదల చేసిన తర్వాత చెక్ చేయగలుగుతారు. పాలిసెట్ 2023 ఫలితాలు మే 27, 2023న విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలకు ముందు విద్యార్థులు తమ మార్కులను లెక్కించడంలో సహాయపడే ఆన్సర్ కీని అధికారులు విడుదల చేస్తారు. అధికారిక వెబ్‌సైట్‌ని
https://polycet.sbtet.telangana.gov.in
సందర్శించడం ద్వారా ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు. అభ్యర్థులు తమ ఆధారాలను ఉపయోగించి ఫలితాన్ని చెక్ చేయవచ్చు. TS POLYCET 2023 ఫలితం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..
టీఎస్ పాలిసెట్ అనధికారిక ఆన్సర్ కీ 2023
TS POLYCET 2023 ఫలితం తేదీ (TS POLYCET 2023 Result Date)
TS POLYCET 2023 ఫలితాల విడుదల తేదీ (అంచనా) ఈ దిగువున అందజేయడం జరిగింది.ఈవెంట్స్ | తేదీలు |
---|---|
పరీక్ష తేదీ | 17 మే 2023 |
ఆశించిన ఫలితం తేదీ | 27 మే 2023 నాటికి |
ఇంకా చెక్ చేయండి: TS POLYCET 2023 Question Paper Analysis
TS POLYCET 2023 ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో స్కోర్‌కార్డ్ రూపంలో విడుదల చేయబడతాయి. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డులో విద్యార్థి పేరు, పొందిన మార్కులు, పొందిన ర్యాంక్ వంటి వివరాలు ఉంటాయి. ర్యాంక్ కార్డ్ పరీక్షలో పొందిన మార్కులు ఆధారంగా అభ్యర్థి ర్యాంక్‌ను ఉంటుంది. అయితే కనీస అర్హత మార్కులు, పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మాత్రమే ర్యాంకు కార్డు జారీ చేయబడుతుంది.
వారు పరీక్షలో అర్హత సాధిస్తే వారు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు. 2023లో TS పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అభ్యర్థులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. దీనిని అనుసరించి వారు తమ ఛాయిస్ లాకింగ్ ఎంపికను తప్పనిసరిగా ఉపయోగించాలి.
మరిన్ని విషయాల కోసం కాలేజ్ దేఖో కోసం చూస్తూ ఉండండి Education News ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించినది. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.