TS POLYCET అనధికారిక ఆన్సర్ కీ 2024, సెట్ A, B, C, D PDF డౌన్‌లోడ్ చేసుకుని మీకొచ్చే మార్కులను చెక్ చేసుకోండి

Guttikonda Sai

Updated On: May 24, 2024 08:23 PM

అన్ని ప్రశ్నాపత్రాల సెట్‌ల కోసం, TS POLYCET ఆన్సర్ కీ 2024 PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. సెట్ A, సెట్ B, సెట్ C మరియు సెట్ D అనధికారిక కీ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 
TS POLYCET Answer Key 2024 UnofficialTS POLYCET Answer Key 2024 Unofficial

TS POLYCET అనధికారిక జవాబు కీ 2024 : TSCHE TS POLYCET 2024 పరీక్షను ఆఫ్‌లైన్ పెన్ మరియు పేపర్ మోడ్‌లో మే 24, 2024న నిర్వహించింది. పరీక్షలో నాలుగు ప్రశ్నాపత్రాల సెట్‌లు ఉన్నాయి: A నుండి సెట్ Dకి సెట్ చేయండి. అధికారిక TS POLYCET జవాబు కీ 2024 అందుబాటులో ఉంటుంది ఒక వారంలోపు విద్యార్థులు అనధికారిక జవాబు కీని తనిఖీ చేయవచ్చు. సబ్జెక్ట్ నిపుణులు అనధికారిక సమాధానాల కీని సిద్ధం చేశారు మరియు ఇది అన్ని ప్రశ్నపత్రాల సెట్‌లకు అందించబడుతుంది. సమాధానాలు ఒక్కొక్కటిగా జోడించబడతాయి, కాబట్టి తాజా సమాధానాలను పొందడానికి పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి! అలాగే, మీకు మీ ప్రశ్నపత్రం సెట్ కోసం అనధికారిక TS POLYCET 2024 జవాబు కీ కావాలంటే, దాని యొక్క స్కాన్ చేసిన PDF కాపీని దిగువ లింక్‌లో షేర్ చేయండి మరియు కొద్దిసేపటి తర్వాత, మా నిపుణులు మీ ప్రశ్నపత్రం సెట్‌కు సమాధానాలను అందిస్తారు.

మీ ప్రశ్నాపత్రం సెట్‌ను పంచుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అనధికారిక తెలంగాణ పాలిసెట్ ఆన్సర్ కీ 2024 గణితం (Unofficial TS POLYCET MathematicsAnswer Key 2024)

అనధికారిక తెలంగాణ పాలిసెట్ గణితం ఆన్సర్ కీ 2024 ఈ దిగువున అందిస్తున్నాం. సెట్ ఏ, బీ, సీ, డీలలోని ప్రశ్నలకు సమాధానాలను ఈ దిగువున అప్‌డేట్ చేశాం.

క్రమ సంఖ్య TS POLYCET 2024 ప్రశ్నలు TS POLYCET 2024 ఆన్సర్ కీ
1 (6 + 5√3) - (4 - 3√3) ఉంది (2) అహేతుక సంఖ్య
2 కింది వాటిలో ఏ ఆకరణీయ సంఖ్య ముగింపు దశాంశాన్ని కలిగి ఉంటుంది? (1) 7/250
3 2023, 2024, 2025 HCF (4) 1
4 log6(2) + log6(3) విలువ (2) 1
5 logb(a) = c ఘాతాంక రూపం (3) ab = c
6 2024 ప్రధాన కారణాంకాల లబ్ధము (2) 23 x 11 x 23
7 కింది రెండు సమితులలో ఏవి సమాన సమితులు? (3) A = {5, 6, 7}, B = {7, 5, 6}
8 {0} అనేది ________ మూలకాలను కలిగి ఉన్న సమితి. (2) 1
9 P(x) = 11x8 - 5x6+ 4x4 - 7x2 + 6 అయితే, P(x)  డిగ్రీ (1) 8
10 -1, -2 బహుపది 2x3 + ax2 + bx - 2 రెండు సున్నాలు అయితే, అప్పుడు a, b విలువలు (3) 5, 1
11 P(x)= 3x^2 -x -4 అను బహుపది యొక్క శున్యాలు α, β అయిన  α. β = (1) -4/3
12 కిరణ్ 5 నారింజలు, 7 యాపిల్స్ మరియు హరీశ్ 2 నారింజలు, 12 యాపిల్స్ విడివిడిగా ఒకే మొత్తానికి కొన్నారు. కింది సమీకరణాలలో ఈ విషయాన్ని సూచించే సమీకరణము ఏది? (2) 5x + 7y = 2x + 12y
13 2/√x + 3/√y = 2 మరియు 4/√x - 9/√y =-1 అయిన (3) x = 4, y =3
14 x +y = 5 మరియు 2x +2y = k అను సమీకరణాల జత అనంతమైన సాధనాలను కలిగి ఉండాలి అనిన, k= (4) 10
15 a1/a2 ≠ b1/b2 అయ్యేటట్లుగా a1x + b1y +c1 =0 అనేవి రెండు రేఖీయ సమీకరణాలైతే ఆ సమీకరణాలు (1) ఏకైక సాధన కలిగి ఉంటాయి
16 3x+ 4y+2=0 మరియు 9x+py+8=0 అను సమీకరణాల జత సమాంతర రేఖలను సూచించిన, p విలువ (4) 12
17 x^2 - 4x +4 అనే వర్గ సమీకరణ మూలాలు (2) 2,2
18 3x^2-5x+2=0 అనే వర్గ సమీకరణ మూలాల మొత్తం (3) 0
19 రెండు చతురస్రాల వైశాల్యాల మొత్తము 625 చ.మీ వాని చుట్టు కొలతల బేధము 20మీ. అయిన ఆ రెండు చతురస్రాల భుజాలను కనుగొనుము (3) 20మీ, 15 మీ
20 3x ^2 -2x+1/3=0 అను వర్గ సమీకరణము యొక్క విచక్షణి (3) 0
21 20,18,16 .... అనే అంకశ్రేఢిలో '-80' ఎన్నవ పదము ? (2) 51
22 3 చే భాగించబడే రెండంకెల సంఖ్యలు ఎన్ని? (3) 30
23 ఒక గుణశ్రేఢిలో 3వ పదము '24' మరియు 6వ పదము '192'అయిన , 10వ పదము (2) 3072
24 25, -5, 1, -1/5,..... అను గుణశ్రేఢి యొక్క సామాన్య నిష్పత్తి (1) -1/5
25 (x1,y1) మరియు (x2,y2) బిందువుల మధ్య దూరము కనుగొనుటకు సూత్రం (1) √(x 2-x1)^2+ (y2-y1)^2
26 బిందువులు (4,-3) మరియు (8,5) లచే ఏర్పడు రేఖాఖండమును 3:1 నిష్పత్తిలో అంతరంగా విభజించు బిందువు నిరూపకాలు (2) (7,3)
27 బిందువులు (1,-1), (0,6) మరియు (-3,0)లు శీర్షాలుగా గల త్రిభుజము యొక్క గురుత్వ కేంద్రము (3) ( -2/3, 5/3)
28 (-5,-1) , (3,-5)మరియు (5,2) అనే బిందువులతో ఏర్పడు త్రిభుజ వైశాల్యము (1) 32
29 ΔABC లో DE || BC , AE/CE = 3/5 మరియు AB= 5.6 సెం.మీ అయిన, AD = (2) 2.1 సెం.మీ
30 ΔABC లో DE || BC, AD=x , DB= x -2, AE = x+2 మరియు EC = x-1 అయిన, 'x' విలువ (4) 4
31 90 సెం.మీ ఎత్తు గల ఒక బాలిక దీపస్తంభము నుండి దూరముగా 120 సెం.మీ/సె. వేగముతో నడుచుచున్నది.దీపస్తంభము ఎత్తు 360 సెం.మీ అయిన, 4 సెకండ్ల తరువాత ఏర్పడే ఆ బాలిక నీడ పొడవు (3) 160 సెం.మీ
32 రెండు సరూప త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తి 2:3 అయితే, ఈ త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి (1) 2:3
33 లంబకోణ త్రిభుజము ABC లో లంబకోణ శీర్షము 'C' వద్ద కలదు, BC = a, CA = b, AB =c, మరియు 'C' నుండి AB కి గీసిన లంబము పొడవు p అయిన (1) cp = ab
34 రెండు సరూప త్రిభుజాల వైశాల్యాలు 81 చ సెం.మీ. మరియు 49 చ.సెం.మీ. చిన్న త్రిభుజములో గీసిన లంబము పొడవు 3.5 సెం.మీ అయిన , పెద్ద త్రిభుజములో దాని అనురూప లంబము పొడవు (4) 4.5 సెం.మీ
35 వృత్తానికి గీయబడిన స్పర్శరేఖ దానిని ______ బిందువు(ల) వద్ద స్పృశిస్తుంది (1) ఒక
36 వృత్త బాహ్యంలో గల ఏదైనా బిందువు గుండా వృత్తానికి ఖచ్చితంగా _____ స్పర్శరేఖలు గీయగలము. (1) రెండు
37 9 సెం.మీ వ్యాసార్ధముగా గల వృత్తానికి దాని కేంద్రం నుండి 15 సెం.మీ. దూరములో ఒక బిందువు కలదు. అయిన ఆ బిందువు నుండి వృత్తానికి గీయబడిన స్పర్శరేఖ పొడవు ____ (4) 12 సెం.మీ
38 క్రింది పటములో 'O' కేంద్రముగా గల వృత్తానికి AP మరియు AQ లు రెండు స్పర్శరేఖలు మరియు ∠POQ = 110° అయిన,  ∠PAQ= ____ (2) 70°
39 5 సెం.మీ. మరియు 3 సెం.మీ. వ్యాసార్ధాలతో రెండు ఏక కేంద్ర వృత్తాలు గీయబడ్డాయి. అయిన , చిన్న వృత్తాన్ని స్పృశించే పెద్ద వృత్తం యొక్క జ్యా పొడవు _____ (3) 8 సెం.మీ
40 వృత్త వ్యాసార్ధము 7 సెం.మీ మరియు సెక్టరు కోణము 72° అయిన, సెక్టరు వైశాల్యము ______ (2) 30.8 సెం.మీ^2
41 ఒక క్రమ వృత్తాకార స్థూపము యొక్క భూవ్యాసార్ధము 14 సెం.మీ మరియు ఎత్తు 21 సెం.మీ. అయిన ఆ స్థూపము వక్రతల వైశాల్యము _____ (3) 3080  సెం.మీ^2
42 6 సెం.మీ. భూవ్యాసార్ధము మరియు 7 సెం.మీ. ఎత్తు కలిగిన ఒక క్రమ వృత్తాకార శంఖువు యొక్క ఘనపరిమాణము ____ (1) 264 సెం.మీ^3
43 ఒక స్థూపము మరియు శంఖువు సమాన భూవ్యాసార్ధమును మరియు ఎత్తును కలిగి ఉన్నాయి, అయినచో , వాటి ఘనపరిమాణముల నిష్పత్తి ____ (3) 3:1
44 64 ఘణపు సెం.మీ ఘనపరిమాణము గల రెండు సమఘనములు అంచులు తాకునట్లు అమర్చబడినవి. అయిన, ఏర్పడిన క్రొత్త ఘనాకృతి యొక్క సంపూర్ణతల వైశాల్యము _____ (2) 160 చ. సెం.మీ.
45 sin^2 15° + cos^2 15° యొక్క విలువ (2) 1
46 4 సెం.మీ. వ్యాసార్థం కలిగిన వృత్తంలో ఒక జ్యా కేంద్రం వద్ద 60° కోణం చేస్తుంది. అప్పుడు ఆ జ్యా పొడవు (4) 4 సెం.మీ
47 cosec θ + cot θ = k అయిన , cosec θ యొక్క విలువ (3) k^2-1/k^2+1
48 A,B మరియు C లు త్రిభుజం ABC లోని అంతర కోణాలైన, cos ( A+B /2) యొక్క విలువ (3) sinC/2
49 cos54° cos 36° - sin54°sin36° యొక్క విలువ (1) 0
50 ఒక బాలుడు ఒక విద్యుత్ స్థంభం అడుగు భాగం నుండి 6 మీ. దూరంలో ఉన్న బిందువు నుండి విద్యుత్ స్థంభం పై భాగాన్ని 60° ఊర్ధ్వ కోణంతో పరిశీలించిన, ఆ స్థంభం ఎత్తు (3) 6√3
51 ఒక హెలికాఫ్టర్ నుండి ఒక వ్యక్తి భూమి పైనున్న ఒక వస్తువును 30° నిమ్నకోణంలో పరిశీలించాడు. భూమి పై నిండి హెలికాఫ్టర్ 500 మీ. ఎత్తులో ఎగురుతువు ఉంటే, వ్యక్తికీ మరియు వస్తువుకు మధ్య దూరం (4) 500/√3 మీ.
52 45 మీ. ఎత్తుగల ఒక గుడి పై భాగాన్ని, దాని ఇరువైపులానున్న ఇద్దరు బాలురు 30° మరియు 60°ఊర్ధ్వ కోణాలతో పరిశీలించారు. ఆ ఇద్దరు బాలుర మధ్య దూరం ఎంత? (1) 60√3 మీ.
53 రెండు పాచికలు ఒకేసారి దొర్లించడం జరిగింది. రెండు పాచికలపై కనిపించే చుక్కల మొత్తం 13 అవ్వడానికి సంభావ్యత ఎంత? (4) 0
54 బాగుగా కలిపిన 52 పేక ముక్కాలా కట్టనుండి యాదృచ్చికంగా ఒక కార్డును తీస్తే అది డైమండు రాణి కావడానికి సంభావ్యత (1) 1/52
55 ఒక కిడ్డీ బ్యాంక్ డబ్బాలో వంద 50 పైసల నాణెములు, యాభై 1 రూపాయి నాణెములు, ఇరవై 2 రూపాయల నాణెములు మరియు పది 5 రూపాయల నాణెములు ఉన్నాయి. డబ్బాను తలక్రిందులు చేసినప్పుడల్లా యాదృచ్చికంగా ఒక నాణెము పడుతుంటే, అది 5 రూపాయల నాణెము కావడానికి సంభావ్యత ఎంత? (4) 1/18
56 ఒక వారములో ఒక పట్టణపు వర్షపాతం 4 సెం.మీ., 5 సెం.మీ., 12 సెం.మీ., 3 సెం.మీ., 6 సెం.మీ., 8 సెం.మీ., మరియు 4 సెం.మీ. అయిన ఒకరోజులో సరాసరి వర్షపాతము (3) 6 సెం.మీ.
57 ఈ క్రింది వానిలో అంకగణిత సగటునకు సూత్రము కానిది ఏది? (1)
58 9,10,19,7,11,5,6,7,8,14,10,7,6 అనే దత్తాంశం యొక్క బాహుళకము (1) 6
59 వర్గీకృత పౌనఃపున్య విభజనానికి , మధ్యగతము సూత్రము (3)
60 75, 21, 56,36,81,05 మరియు 42ల మధ్యగతము (1) 36

అనధికారిక తెలంగాణ పాలిసెట్ ఫిజిక్స్ ఆన్సర్ కీ 2024 (Unofficial TS POLYCET Physics Answer Key 2024)

తెలంగాణ పాలీసెట్ 2024 ఫిజిక్స్ ప్రశ్నలను మరియు సమాధానాలను విద్యార్థులు ఇక్కడ చూడవచ్చు.

క్రమ సంఖ్య TS POLYCET 2024 ప్రశ్నలు TS POLYCET 2024 ఆన్సర్ కీ
61 ఈ క్రింది వాటిలో కుంభాకార దర్పణంను దేనికి వాడుతారు (3) వాహనాలలో రియర్ వ్యూ దర్పణంగా
62 పుటాకార దర్పణాలు ఏర్పరుచు ప్రతిబింబము (3) నిజ మరియు మిథ్యా ప్రతిబింబము
63 ఎల్లప్పుడూ చిన్నదైనా ప్రతిబింబం ఇచ్చు దర్పణము (2) కుంభాకార దర్పణము
64 పుటాకార దర్పణ నాభ్యంతరం 20 సెం.మీ. అయిన, మిథ్యా ప్రతిబింబమును ఏర్పరుచుటకు వస్తువును ఉంచవలసిన స్థానము (1) 20 సెం.మీ. కంటే తక్కువ
65 పలుచని కటకం యొక్క మధ్య బిందువు (1) దృక్ కేంద్రం
66 కటక ప్రధానక్షం వెంబడి ప్రయాణించే కాంతి కిరణము (4) విచలనం పొందదు
67 ఈ కింది ఏ సందర్భంలో కుంభాకార కటకం నిజ ప్రతిబింబం ఇవ్వదు? (1) నాభి మరియు కటక దృక్ కేంద్రం మధ్య వస్తువును ఉంచినప్పుడు
68 కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకం కన్నా తక్కువ వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచినప్పుడు అది దేని వలే పని చేస్తుంది? (2) కేంద్రీకరణ కటకం
69 కటక వక్రీభవన గుణకం n = 1.5 గా గల ద్విపుటాకార కటకం గాలిలో ఉంచబడినది. ఈ కటకం యొక్క రెండు వక్రతలాల వక్రతా వ్యాసార్ధాలు వరుసగా R1= 20 సెం.మీ. మరియు R2=80 సెం.మీ. అయిన, కటక నాభ్యంతరం ఎంత? (3) -32 సెం.మీ.
70 పట్టక వక్రీభవన గుణకమునకు సూత్రము (3)
71 ఆరోగ్యవంతుడైన మానవునికి స్పష్ట దృష్టి కనీస దూరము (3) 25 సెం.మీ.
72 కటక సామర్ధ్యం 4D అయిన, కటక నాభ్యంతరము (2) 25 సెం.మీ
73 దూరములో ఉన్న వస్తువులను చూడలేని కంటి దోషము (3)హ్రస్వదృష్టి
74 రెటీనా పై సరియైన ప్రతిబింబం ఏర్పడే విధంగా కటక నాభ్యంతరాన్ని తగిన విధంగా మార్పు చేసుకునే పద్దతిని ఏమంటారు? (2) సర్దుబాటు
75 సూర్యోదయం,సూర్యాస్తమయ సమయాలలో సూర్యుడు ఎరుపుగా కనిపించుటకు కారణము (2) కాంతి పరిక్షేపణం
76 విద్యుత్ నిరోధం యొక్క S.I ప్రమాణము (4) ఓమ్
77 విశిష్ట నిరోధానికి సూత్రము (1) p= RA/L
78 స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకంలోని విద్యుత్ ప్రవాహము, వాహకపు రెండు చివరల మధ్యగల పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉండును. దీనిని ఏ నియమం అంటారు. (3) ఓమ్ నియమం
79 కిర్ ఛాఫ్ జంక్షన్ నియమము ఆ భౌతిక రాశి నిత్యత్వమును అనుసరించి వస్తుంది? (3) ఆవేశము
80 ఈ క్రింది వలయంలో ఫలిత నిరోధం ఎంత? (2)
81 పొటెన్షియల్ భేదాన్ని కొలిచే పరికరము (2) వోల్ట్ మీటర్
82 అయస్కాంత క్షేత్ర బలరేఖకు ఒక బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశ ఆ బిందువు వద్ద దేనిని తెలుపుతుంది ? (3) అయస్కాంత క్షేత్ర దిశ
83 సమ అయస్కాంత క్షేత్రంలోని ప్రమాణ వైశాల్యం గల ప్రాంతం గుండా తాళానికి లంబంగా పోయే అభివాహాన్ని ఏమంటారు? (1) అయస్కాంత అభివాహ సాంద్రత
84 విద్యుత్ ప్రవహిస్తున్న సోలినాయిడ్ బయట అయస్కాంత బలరేఖల దిశా ఏ వైపు ఉంటుంది ? (2) ఉత్తరం నుండి దక్షిణం
85 విద్యుత్ మోటార్ లలో (1) విద్యుత్ శక్తి, యాంత్రిక శక్తిగా మారుతుంది.
86 ఏ నియమం ప్రకారం " సంపూర్ణ వలయంలో ప్రవహించే ప్రేరిత విద్యుత్ ప్రవాహం దానికి కారణమైన అయస్కాంత అభివాహంలో మార్పులను వ్యతిరేకించేటట్లు ప్రవహిస్తుంది." (2) లెంజ్ నియమము
87 ఇండక్షన్ స్టవ్ ఏ నియమం పై పని చేస్తుంది? (3) విద్యుత్ అయస్కాంత ప్రేరణ
88 'I' పొడవు గల వాహకం, 'B' అయస్కాంత క్షేత్రానికి లంబంగా 'v' వేగంతో కదులుతున్నది. వాహక కొనాల మధ్య ఏర్పడే 'గమన విద్యుఛ్చలకాబలం ' (1) Blv
89 3 మీ పొడవు, 2A విద్యుత్ ప్రవాహము గల వాహక తీగను 0.4T అయస్కాంత అభివాహ సాంద్రత గల క్షేత్రం దిశకు 30° కోణంలో ఉంచినప్పుడు ఆ తీగపై కలుగజేయబడిన అయస్కాంత క్షేత్ర బలం ఎంత? (2) 1.2N
90 ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలలో ఏది సరియైనది? (4) AC తన దిశ మరియు పరిమాణాలు రెండిటినీ మార్చుకుంటుంది.

అనధికారిక తెలంగాణ పాలిసెట్ కెమిస్ట్రీ ఆన్సర్ కీ 2024 (Unofficial TS POLYCET Chemistry Answer Key 2024)

తెలంగాణ పాలీసెట్ 2024 కెమిస్ట్రీ ప్రశ్నలను మరియు సమాధానాలను విద్యార్థులు ఇక్కడ చూడవచ్చు.

క్రమ సంఖ్య TS POLYCET 2024 ప్రశ్నలు TS POLYCET 2024 ఆన్సర్ కీ
91 రసాయన చర్యలో విడుదలగు వాయువునకు రసాయన సమీకరణాల్లో సూచించు చిహ్నము (3) ↑
92 STP  వద్ద 10 గ్రా. హైడ్రోజెన్ ఆక్రమించు ఘనపరిమాణము లీటర్లలో (2) 112
93 క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాను ప్రతిపాదించినవారు (3) ఇర్విన్ శ్రోడింగర్
94 ఒక ఉప కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రానుల సంఖ్య (3) 2(2l+1)
95 కార్బన్ పరమాణువులో ఉన్న ఒంటరి ఎలక్ట్రానుల సంఖ్య (4) 2
96 అష్టక నియమమును ప్రతిపాదించిన వారు (4) న్యూలాండ్స్
97 నవీన ఆవర్తన పట్టికలో ఆరవ పిరియడ్ లో ఉండే మూలకాల సంఖ్య (1) 32
98 ఈ క్రింది వానిలో తక్కువ పరిమాణం కల పరమాణువు ఏది? (4) C
99 అయనీకరణ శక్తి పీరియడ్ లో ఎడమ నుండి కుడికి పోయేకొద్దీ సాధారణంగా (1) పెరుగును
100 పరమాణు సంఖ్య 17 గల మూలకం దీనికి చెందును (4) VII A గ్రూపు, 3వ పీరియడ్
101 ఆక్సిజన్ రసాయన మార్పుకు లోనయ్యేప్పుడు _____ ఎలక్ట్రానులను గ్రహించును. (2) 2
102 NH3 లోని నైట్రోజెన్ బాహ్య కక్షలో ఉండు బంధ మరియు ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు (3) 3,1
103 BeCl2 అణువులో బంధ కోణము (2) 180°
104 ఆయానిక బంధం వీటి మధ్య ఎలక్ట్రాన్ల బదిలీ వలన ఏర్పడును (1) లోహ పరమాణువు నుండి అలోహ పరమాణువుకు
105 ధృవాత్మకత సంయోజనీయ బంధం కలది (4)HCl
106 ద్వి బంధం కలది (3) N2
107 క్షార ద్రావణాలలో మిథైల్ ఆరంజ్ సూచిక యొక్క రంగు (1) పసుపు
108 క్షారంతో ఆమ్లం చర్య జరిపి లవణాన్ని మరియు నీటిని ఏర్పరచే చర్య (3) తటస్థీకరణం
109 తాగే నీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమిసంహారిణిగా ఉపయోగించేది ఏది? (2) బ్లీచింగ్ పౌడర్
110 ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటిలో కరిగించే ప్రక్రియ (2) ఉష్ణగ్రాహక చర్య
111 ప్రకృతిలో స్వేచ్చా స్థితిలో లభ్యమయ్యే లోహము (2) Au
112 గెలీనా అనేది _____ యొక్క ధాతువు (2) Pb
113 ప్రగలనంలో ధాతువు (1) ఆక్సీకరించబడుతుంది
114 కార్బన్ పరమాణువుల మధ్య ఏక బంధాలను మాత్రమే కలిగి ఉండే హైడ్రోకార్బన్ లను _____ అంటారు (1) ఆల్కేన్లు
115 ఈ క్రింది వాటిలో కీటోన్ ఏది? (1)
116 -COOH లోని హైడ్రోజెన్ పరమాణువుకు బదులుగా 'R' (ఆల్కైల్ గ్రూపు ) ను ప్రతిక్షేపిస్తే ____ (2) ఎస్టర్లు
117 ఇథైన్ అణువులోని సిగ్మా మరియు π- బంధాల సంఖ్య (4) 3 సిగ్మా, 2π
118 పిండి పదార్ధాలు మరియు చక్కెరలను ఇథైల్ ఆల్కహాల్ గా మార్చే ప్రక్రియ (3) కిణ్వప్రక్రియ
119 కింది వాటిలో అసంతృప్త సమ్మేళనం ఏది? (3)CH3-CH = CH2
120 సూర్యకాంతి సమక్షంలో క్లోరిన్ తో మీథేన్ చర్య జరిపినప్పుడు ఏర్పడే తుది సమ్మేళనము (1) CH3Cl

అనధికారిక తెలంగాణ పాలిసెట్ జీవశాస్త్రం ఆన్సర్ కీ 2024 (Unofficial TS POLYCET Biology Answer Key 2024)

తెలంగాణ పాలీసెట్ 2024 జీవశాస్త్రం ప్రశ్నలను మరియు సమాధానాలను విద్యార్థులు ఇక్కడ చూడవచ్చు.

క్రమ సంఖ్య TS POLYCET 2024 ప్రశ్నలు TS POLYCET 2024 ఆన్సర్ కీ
121 ఆకులలో పిండి పదార్ధపు ఉనికిని నిర్ధారించుటకు ఏ పరీక్ష జరుపబడును? (2) అయోడిన్ పరీక్ష
122 నోటిలో ముక్కలుగా చేయబడిన ఆహరం లాలాజలంతో కలిసి తడిగా, మెత్తగా జారుడు స్వభావాన్ని పొందే పదార్ధాన్ని ఏమందురు? (1) బోలస్
123 క్రింది వానిలో ఏది సరైన వాక్యము ? (1) క్లోరోఫిల్ - 'a ' నీలి ఆకుపచ్చ వర్ణం మరియు క్లోరోఫిల్ - 'b' పసుపు ఆకుపచ్చ వర్ణంలో ఉండును.
124 శ్వాస క్రియలో సరిఅయిన వివిధ దశల క్రమమును గుర్తించండి (1) ఉఛ్వాస నిశ్వాసాలు → ఊపిరితిత్తులలో వాయు మార్పిడి → రక్తం ద్వారా వాయు రవాణా → కణజాలాల్లో వాయు మార్పిడి → కణ శ్వాసక్రియ
125 ప్రతి ATP లో ఎంత శక్తి నిల్వ ఉంటుంది ? (3) 72000 కేలరీలు
126 C 6 H 12 O 6 + 6O 2 → 6CO 2 + 6H 2 O + శక్తి ఈ సమీకరణం దేనిని సూచిస్తుంది? (2)శ్వాసక్రియ
127 రక్తం గడ్డకట్టిన తరువాత మిగిలిన గడ్డి పసుపురంగు ద్రవాన్ని ____అంటారు (3) సీరం
128 కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్యగల కుడి కర్ణిక జఠారికాంతర విభాజకముపై గల కవాటాన్ని ఏమంటారు? (1)అగ్రత్రయ కవాటం
129 రక్త పీడనానికి సంబంధించి ఆరోగ్యవంతులైన యువతీయువకులలో సిస్టోలిక్ పీడనం ఎంత ఉంటుంది? (4) 120 మి.మీ పాదరస పీడనం
130 పత్రాల నుండి నీరు ఆవిరి రూపంలో వెలుపలికి రావడాన్ని ఏమందురు? (2) బాష్పోత్సేకం
131 వాసోప్రెసిన్ లోపం వలన తక్కువ గాఢత గల మూత్రం అధికంగా విసర్జించబడును. ఈ స్థితిని ఏమంటారు? (2) డయాబెటిక్ ఇన్సిపిడస్
132 మూత్రాశయంలో గరిష్టంగా _____ మూత్రం నిల్వ ఉంటుంది? (4) 700-800 మి.లీ
133 మూత్రపిండాలు ఏ జీవులలో విసర్జకాంగాలు? (3) పక్షులు
134 క్రింది వాటిలో మొక్కలలో వివిధ భాగాలలో నిల్వ చేయబడు నత్రజనియుత , విషపూరితమైన ఉపఉత్పన్నాలు ఏవి? (3) ఆల్కలాయిడ్లు
135 ఇన్సులిన్ మరియు గ్లూకగాన్ అను హార్మోన్లు _____ అనే వినాళ గ్రంథి స్రవించును. (4) క్లోమం
136 _____ వల్ల ఫలాలు పక్వానికి వచ్చును. (1) ఇథిలీన్
137 వేరు భూమి వైపు పెరుగుతుంది, మొక్కలు గురుత్వాకర్షణ బలం వైపు ప్రతిస్పందిస్తాయి. దీనిని ఏమందురు? (2) గురుత్వానువర్తనం
138 పాలనుండి పెరుగు తయారవడానికి ______ బాక్టీరియా తోడ్పడుతుంది. (2) లాక్టోబాసిల్లస్
139 కాండం ద్వారా శాఖీయ ప్రత్యుపట్టి జరిపే ఉదాహరణలు ఏవి? (4) పైవి అన్నీ
140 చాలా పుష్పించే మొక్కల్లో పిండకోశం సాధారణంగా _____ కలిగి ఉంటాయి. (1) 7 కణాలు మరియు 8 కేంద్రకాలు
141 సరియైన శుక్రకణాల ప్రయాణ మార్గం ఏది? (1) శుక్రోత్పాదక నాళికలు → శుక్రనాళికలు → ఎపిడిడిమిస్ → స్కలన నాళం → ప్రసేకం
142 ఆహార నాళపు గోడలు _____ అనే జారుడు గుణంగల జిగురు పదార్ధాన్ని స్రవిస్తాయి. (3) శ్లేష్మం
143 జీర్ణాశయం నుండి కొద్దీ మోతాదుల్లో అసంపూర్ణంగా జీర్ణమైన ఆహరం (ఖైమ్) _____ లోకి విడుదలవుతుంది. (1) ఆంత్రమూలం
144 ఏకసంకరణం జరిపినప్పుడు , F2 త్రం యొక్క దృశ్యరూప నిష్పత్తి _____ (2) 3:1
145 మానవకణంలో లైంగిక క్రోమోజోముల సంఖ్య (1) 2
146 చిన్న జనాభాలలో ఆకస్మికంగా సంభవించే సంఘటనల ఫలితంగా జన్యువుల పౌనఃపున్యంలో మార్పులు ఏర్పడడాన్ని _____ అంటారు. (3) జన్యు విస్థాపనం
147 మానవులలో అకస్మాత్తుగా అవశేష అవయవాలు తిరిగి కనిపించడాన్ని ____ అంటారు. (1)ఆటవిజం
148 ఆహారపు గొలుసులో కాలుష్యాలు చేరడాన్ని _____ అంటారు. (2) జైవిక వ్యవస్థాపనం
149 జీవ ఇంధనం ఉత్పత్తికి _____ మొక్క యొక్క విత్తనాలను వాడతారు. (1) జట్రోపా
150 బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువులు ఏ రకానికి చెందిన ఇంధనాలు? (4) శిలాజ ఇంధనాలు


TS POLYCET అనధికారిక ఆన్సర్ కీ 2024 : సెట్ వారీగా PDF డౌన్‌లోడ్ (TS POLYCET Answer Key 2024 Unofficial: Set-wise PDF Download)

పరీక్ష ముగిసిన కొద్దిసేపటికే, సెట్ A, సెట్ B, సెట్ C, సెట్ D కోసం TS POLYCET అనధికారిక జవాబు కీ 2024 నేరుగా PDF డౌన్‌లోడ్ కోసం ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది:

TS POLYCET ఆన్సర్ కీ 2024 సెట్‌లు డౌన్‌లోడ్ లింక్
సెట్ A డౌన్‌లోడ్ లింక్ త్వరలో యాక్టివేట్ చేయబడుతుంది!
సెట్ B డౌన్‌లోడ్ లింక్ త్వరలో యాక్టివేట్ చేయబడుతుంది!
సెట్ C డౌన్‌లోడ్ లింక్ త్వరలో యాక్టివేట్ చేయబడుతుంది!
సెట్ D డౌన్‌లోడ్ లింక్ త్వరలో యాక్టివేట్ చేయబడుతుంది!



TS పాలిసెట్ ఆన్సర్ కీ 2024: మార్కులను ఎలా లెక్కించాలి?

TS POLYCET 2024లో మొత్తం 150 ప్రశ్నలు ఇలా విభజించబడ్డాయి: గణితానికి 60 ప్రశ్నలు మరియు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీకి ఒక్కొక్కటి 30 ప్రశ్నలు. నెగెటివ్ మార్కింగ్ లేదు మరియు ప్రతి ప్రశ్నకు 1 మార్కు వెయిటేజీ ఉంటుంది. అయితే, ఒకే పేపర్‌లో రెండు స్ట్రీమ్‌లు ఉన్నందున, MPC మరియు BiPC విద్యార్థులకు మార్కుల గణన భిన్నంగా ఉంటుంది. కాబట్టి, మొత్తం మార్కులు ఇలా లెక్కించబడతాయి:

1. MPC కోసం:

MPC విద్యార్థులు ఎటువంటి జీవశాస్త్ర ప్రశ్నలను ప్రయత్నించకూడదు, కాబట్టి MPC మార్కులను నేరుగా ఇలా లెక్కించవచ్చు:

  • MPC మార్కులు = గణితం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రంలో సరైన సమాధానమిచ్చిన మొత్తం ప్రశ్నల సంఖ్య

2. BiPC కోసం:

PJTSAU, PVNRTVU మరియు SKLTSHU అందించే అగ్రికల్చరల్ మరియు వెటర్నరీ డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా బయాలజీ విభాగంలో ప్రయత్నించాలి. గణితం మార్కులు 30కి తగ్గించబడతాయి కాబట్టి, BiPC మార్కులను ఈ క్రింది విధంగా లెక్కించవచ్చు:

  • BiPC మార్కులు = బయాలజీ, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో సరిగ్గా సమాధానమిచ్చిన మొత్తం ప్రశ్నల సంఖ్య + 0.5 * గణితంలో సరిగ్గా సమాధానమిచ్చిన మొత్తం ప్రశ్నల సంఖ్య

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-polycet-answer-key-2024-unofficial-available-set-a-b-c-and-d-pdf-download-52915/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top