తెలంగాణ సెట్ 2024 ఆన్సర్ కీ (TG SET 2024 Key) : ఉస్మానియా యూనివర్సిటీ TG SET 2024 ఆన్సర్ కీ (TG SET 2024 Key) రిలీజ్ అయింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని చూడవచ్చు. అధికారిక నోటీసు ప్రకారం ఈరోజు అంటే సెప్టెంబర్ 24న అభ్యంతరాల విండో ఓపెన్ అవుతుంది. సెప్టెంబర్ 26, 2024న క్లోజ్ అవుతుంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు TG SET వెబ్‌సైట్‌కి వారి హాల్ టికెట్, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వవచ్చు. ప్రశ్న ID ఆధారంగా వారి సబ్జెక్ట్‌లో అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఆన్సర్ కీపై ఎలా అభ్యంతరాలు తెలియజేయాలో ఈ దిగువున స్టెప్స్‌ని అందించడం జరిగింది. అభ్యర్థులు అది ఫాలో అవ్వొచ్చు.
TS SET 2024 ఆన్సర్ కీ అభ్యంతరం లింక్ (TS SET 2024 Answer key objection Link)
TS SET 2024 ఆన్సర్ కీ అభ్యంతరం లింక్ |
---|
తెలంగాణ సెట్ 2024 ఆన్సర్ కీపై ఎలా అభ్యంతరాలు తెలియజేయాలి? (TG SET 2024 Answer Key: How to Raise objections)
TG SET 2024 ఆన్సర్ కీకి వ్యతిరేకంగా అభ్యంతరాలను లేవనెత్తడానికి, అభ్యర్థులు దిగువున ఇవ్వబడిన స్టెప్స్‌ను అనుసరించాలి.- ముందుగా అభ్యర్థులు http://telanganaset.org/ వద్ద TG SET అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- హోంపేజీలో అందుబాటులో ఉన్న TG SET 2024 ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి.
- లాగిన్ వివరాలను నమోదు చేసి, Submitపై క్లిక్ చేయండి.
- పూర్తైన తర్వాత, ప్రశ్నను ఎంచుకుని, అభ్యంతరం చెప్పండి.
- మీ సమాధానానికి మద్దతు ఇవ్వడానికి అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
- డాక్యుమెంట్లు అప్‌లోడ్ తర్వాత Submit బటన్‌పై క్లిక్ చేయండి.
- తదుపరి ఉపయోగం కోసం పేజీని డౌన్‌లోడ్ చేయండి. దాని హార్డ్ కాపీని ఉంచండి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్లను తెలుసుకోండి.