తెలంగాణ సెట్ 2024 (TS SET 2024) : ఉస్మానియా విశ్వవిద్యాలయం తన వెబ్‌సైట్‌లో తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS SET) 2024 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. తెలంగాణ సెట్‌కు (TS SET 2024) దరఖాస్తు చేసుకోవాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో telanganaset.orgలో అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి లేట్ ఫీజు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 14వ తేదీన ప్రారంభమై జూలై 2న ముగుస్తుంది. అయితే ఈ తేదీ తర్వాత తమ దరఖాస్తులను సబ్మిట్ చేసే అభ్యర్థులు ఆలస్య ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు దిద్దుబాటు విండో జూలై 28 నుంచి 29 వరకు తెరవబడుతుంది. TS SET 2024 పరీక్ష ఆగస్టు 28 నుంచి 31 వరకు నిర్వహించబడుతోంది.
తెలంగాణ సెట్ 2024 ముఖ్యమైన తేదీలు (TS SET 2024 Important Dates)
తెలంగాణ SET 2024 పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు, ఇతర ముఖ్యమైన తేదీలు TS SET నోటిఫికేషన్ 2024తో పాటు ప్రకటించబడ్డాయి. ఈ దిగువ పట్టికలో అన్ని ముఖ్యమైన తేదీలను చెక్ చేయండి.ఈవెంట్స్ | ముఖ్యమైన తేదీలు |
---|---|
TS SET 2024 నోటిఫికేషన్ | మే 4, 2024 |
TS SET 2024 ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభం | మే 14, 2024 |
ఆలస్య ఫీజు లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | జూలై 2, 2024 |
లేట్ ఫీజుతో రూ. 1500 రిజిస్ట్రేషన్ చివరి తేదీ | జూలై 8, 2024 |
లేట్ ఫీజు రూ. 2000తో చివరి తేదీ | జూలై 16, 2024 |
లేట్ ఫీజు రూ. 3000తో చివరి తేదీ | జూలై 26, 2024 |
TS SET 2024 దరఖాస్తు ఫార్మ్ దిద్దుబాటు విండో | జూలై 28 & 29, 2024 |
TS SET 2024 హాల్ టికెట్ల విడుదల తేదీ | ఆగస్టు 2, 2024 |
తెలంగాణ సెట్ పరీక్ష తేదీ 2024 | ఆగస్టు 28 నుంచి 31, 2024 వరకు |
తెలంగాణ సెట్ ఎగ్జామ్‌కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply for the Telangana SET Exam?)
ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌ను అధికారులు ఇంకా యాక్టివేట్ చేయలేదు. అభ్యర్థులు- స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను telanganaset.org సందర్శించాలి.
- స్టెప్ 2: హోంపేజీలో అందించిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: ప్రత్యేక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను రూపొందించడానికి రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ను పూరించాలి.
- స్టెప్ 4: దాంతో అభ్యర్థులకు అకౌంట్ ఓపెన్ అవుతుంది. దాంతో మీ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
- స్టెప్ 5: తర్వాత TS SET అప్లికేషన్ ఫార్మ్ 2024 ఓపెన్ అవతుంది. ఆ దరఖాస్తును విజయవంతంగా సబ్మిట్ చేయడానికి మీ వివరాలను నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
- స్టెప్ 6: దరఖాస్తు ఫీజును చెల్లించి, భవిష్యత్తు సూచన కోసం అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.