తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2024 విడుదల తేదీ (TS SSC Results 2024 Date) : తెలంగాణ పదో తరగతి పరీక్షలు 18 మార్చి నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో జరిగాయి. అప్పటి నుంచి విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విద్యార్థుల ఎదురుచూపులు ఫలించేలా పదో తరగతి ఫలితాలపై ఓ అప్‌డేట్ వెలువెడింది.. తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు (TS SSC Results 2024 Date) ఏప్రిల్ 30వ తేదీన, మే 1వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్షలకు మొత్తం 5, 08, 385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పేపర్ల వాల్యుయేషన్ ఏప్రిల్ 20వ తేదీతో ముగిసింది. దీనికి సంబంధించిన విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2024 ముఖ్యమైన విషయాలు
తెలంగాణ పదో తరగతి ఫలితాలపై (TS SSC Results 2024 Date) ముఖ్యమైన విషయాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది.ఎగ్జామినేషన్ పేరు | తెలంగాణ పదో తరగతి పరీక్ష 2023-24 |
---|---|
కండక్టింగ్ బాడీ | డైరక్ట్‌రేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, తెలంగాణ |
పరీక్ష తేదీలు | మార్చి 18 - ఏప్రిల్ 2, 2024 |
పదో తరగతి ఫలితాల అనౌన్స్‌మెంట్ డేట్ | ఆన్‌లైన్ |
పదో తరగతి ఫలితాల విడుదల తేదీ | ఏప్రిల్ 30, మే 01, 2024 |
అధికారిక వెబ్‌సైట్ | bse.telangana.gov.in |
TS SSC ఫలితాలను 2024 ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి? (How to check TS SSC Result 2024 online?)
తెలంగాణ పదో తరగతి ఫలితాలను చెక్ చేసే విధానం ఈ దిగువున అందించడం జరిగింది.- అధికారిక తెలంగాణ SSC బోర్డ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- 2023-24 SSC ఫలితాల కోసం నియమించబడిన లింక్ కోసం చూడాలి.
- లింక్‌పై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
- మీ ఫలితాన్ని వీక్షించడానికి వివరాలను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్తు ఉపయోగం కోసం ఫలితం కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.