తెలంగాణ టెట్ 2024హాల్ టికెట్ డౌన్‌లోడ్ డేట్ (TS TET 2024 Hall Ticket Download Date) : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అనేది తెలంగాణ పాఠశాల విద్యా శాఖ నిర్వహించే రాష్ట్ర స్థాయి పరీక్ష. ఇది ప్రాథమిక తరగతులకు (1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు), ఉన్నత ప్రాథమిక తరగతులకు (6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు) అర్హులైన ఉపాధ్యాయుల నియామకం కోసం రూపొందించబడింది.తెలంగాణ టెట్ పరీక్షలు జనవరి 1 నుండి జనవరి 20, 2024వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఇప్పటికే విడుదలైంది. తెలంగాణ హాల్ టికెట్లు (TS TET 2024 Hall Ticket Download Date) కూడా అతి త్వరలో రిలీజ్ కానున్నాయి. దరఖాస్తుదారులందరూ హాల్ టికెట్ల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ దిగువున అందించాం.
TS TET హాల్ టికెట్లు 2024 వివరాలు (TS TET Hall Tickets 2024 Overview)
TS TET రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో వివిధ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం గేట్‌వేలాంటిది. ప్రాథమిక ఉపాధ్యాయుల కోసం ఉద్దేశించిన అభ్యర్థులు పేపర్ 1 పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. TS TET 2024 హాల్ టికెట్లు త్వరలో విడుదలకానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.దేశం | భారతదేశం |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
పరీక్ష పేరు | తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (II) 2024 |
కండక్టింగ్ బాడీ | పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ |
ప్రయోజనం | ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత |
పరీక్ష తేదీ | 2024జనవరి 1 నుండి 20 వరకు |
హాల్ టికెట్ విడుదల తేదీ | డిసెంబర్ 26, 2024 (అంచనా) |
అధికారిక వెబ్‌సైట్ | https://tgtet2024.aptonline.in/tgtet/ |
TS TET అడ్మిట్ కార్డ్ 2025ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download TS TET Admit Card 2024 ?)
తెలంగాణ టెట్ హాల్ టికెట్లను 2024ఈ దిగువున తెలిపిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.- అధికారిక వెబ్‌సైట్ tgtet2024.aptonline.in/tgtetని సందర్శించండి.
- హోంపేజీలో TS TET హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి అవసరమైన వివరాలను నమోదు చేయండి.
- భవిష్యత్తు సూచన కోసం హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు..