తెలంగాణ టెట్ రిజిస్ట్రేషన్ వివరాలు 2024 (TS TET Registration Details 2024) : తెలంగాణ టెట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ (TS TET Registration Details 2024) మార్చి 27వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే 15వ తేదీ నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS TET 2024 పరీక్షలు మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రతి రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ టెట్ ఫలితాలు జూన్ 12వ తేదీన ప్రకటించడం జరుగుతుంది.
తెలంగాణ టెట్ 2024 ముఖ్యమైన తేదీలు (TS TET 2024 Important Dates)
తెలంగాణ టెట్ 2024కు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది.TS TET 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ | మార్చి 27, 2024 |
---|---|
TS TET 2024 | ఏప్రిల్ 10, 2024 |
TS TET 2024 హాల్ టికెట్లు డౌన్‌లోడ్ తేదీ | మే 15, 2024 |
TS TET 2024 పరీక్షల తేదీ | మే 20 నుంచి జూన్ 3, 2024 |
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల తేదీ | జూన్ 12, 2024 |
TS TET 2024 అధికారిక వెబ్‌సైట్ | tstet.cgg.gov.in |
TS TET 2024కి ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply for TS TET 2024?)
తెలంగాణ టెట్ 2024కి దరఖాస్తు చేసుకునే విధానం ఈ దిగువున స్టెప్స్‌ని అందించడం జరిగింది.- ముందుగా అభ్యర్థులు TS TET 2024 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- కొత్త వినియోగదారు అయితే, మీరు తప్పనిసరిగా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లింక్‌ని వెదికి దానిపై క్లిక్ చేయాలి.
- అభ్యర్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
- అనంతరం వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు, ఫార్మ్‌లో అభ్యర్థించిన ఏదైనా ఇతర సమాచారంతో సహా అవసరమైన అన్ని వివరాలను కచ్చితంగా నమోదు చేసి దరఖాస్తును పూర్తి చేయాలి.
- మీరు నిర్దిష్ట పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు ఫార్మ్‌ను సబ్మిట్ చేయాలి.