తెలంగాణ టెట్ 2024 దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం TS TET 2024 దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజు అంటే ఏప్రిల్ 10వ తేదీన చివరి తేదీ. కానీ ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ వరకు గడువును పెంచింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. TS TET దరఖాస్తు ప్రక్రియ 2024ని తెలంగాణ పాఠశాల విద్యా శాఖ మార్చి 27, 2024న మొదలుపెట్టింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tstet2024.aptonline.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. TSTET 2024 దరఖాస్తు ఫార్మ్ లింక్ అభ్యర్థి సౌలభ్యం కోసం ఇక్కడ అందించబడింది. మొట్టమొదటిసారిగా TS TET 2024 పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. నోటిఫికేషన్ ప్రకారం TS TET 2024 పరీక్షను మే 20 నుంచి జూన్ 3, 2024 వరకు అథారిటీ నిర్వహించాల్సి ఉంది.
తెలంగాణ టెట్ అప్లికేషన్ ఫార్మ్ 2024 డైరక్ట్ లింక్ (TS TET Application Form 2024 Direct Link)
తెలంగాణ టెట్ అప్లికేషన్ ఫార్మ్ 2024 లింక్ |
---|
తెలంగాణ టెట్‌కు 2024 ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply for Telangana TET 2024)
TS TET అప్లికేషన్ ఫార్మ్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో మార్చి 27, 2024న యాక్టివేట్ అయింది. అభ్యర్థులు TS TET దరఖాస్తు ప్రక్రియను ఏప్రిల్ 20వ తేదీ వరకు సబ్మిట్ చేయవచ్చు. అప్లికేషన్ ఫార్మ్‌ను పూర్తి చేసి విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థులు హార్డ్ కాపీని దగ్గరే ఉంచుకోవాలి. అలాగే అభ్యర్థులు భవిష్యత్తు సూచన కోసం 'అభ్యర్థి ID' నెంబర్‌ను దగ్గరే ఉంచుకోవాలి.- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను tstet2024.aptonline.in సందర్శించాలి.
- హోంపేజీలో ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌ని క్లిక్ చేయాలి.
- తర్వాత TS TET దరఖాస్తు ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అందులో వివరాలు ఇచ్చి పూరించాలి.
- ఫోటోగ్రాఫ్, సంతకం స్కాన్ చేసిన ఫోటోలు అప్‌లోడ్ చేయాలి.
- TS TET దరఖాస్తు ఫీజును చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- అనంతరం నిర్ధారణ పేజీ ప్రింటవుట్ తీసుకోవాలి.
తెలంగాణ టెట్ 2024 ప్రిపరేషన్ టిప్స్ (TS TET 2024 Preparation Tips)
TS TET 2024 పరీక్షకు ప్రిపేర్ అయ్యే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షా విధానాన్ని చెక్ చేయాలి. ఔత్సాహిక అభ్యర్థుల కోసం ప్రిపరేషన్ టిప్స్ కింద అందించబడ్డాయి.- TS TET సిలబస్‌ను కవర్ చేయడానికి టైమ్‌టేబుల్‌ను రూపొందించుకోవాలి.
- మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
- పరీక్షలో నెగెటివ్ మార్కులు లేకపోయినా కచ్చితత్వం కోసం ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ స్కోర్ చేసిన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయి.
- విభాగాల వారీగా ముఖ్యమైన అంశాలను చెక్ చేయాలి. వాటి చుట్టూ వ్యూహాన్ని రూపొందించాలి.
- అభ్యర్థులు చదువు మధ్యలో తగినంత విశ్రాంతి తీసుకోవాలి.